నాగ శౌర్య తో ప్రేమ రహస్యం ఫై స్పందించిన నిహారిక

నాగ శౌర్య తో ప్రేమ రహస్యం ఫై స్పందించిన నిహారిక

మెగా ఫ్యామిలీ నుండి మెరిసిన ఏకైక తార నిహరిక ‘ఒక మనసు’లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకి సాగుతున్న ఈ అమ్మాయి ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.

త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది. అయితే సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నా కూడా ఈ భామని కొన్ని ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయట.అవేంటంటే ప్రేమ వ్యవహారాల గురించి అంట..  నాగశౌర్యతో ప్రేమాయణం గురించి… పెళ్లి గురించి  ఎక్కువ మంది అడుగుతున్నారట.

తాజాగా ఈ ప్రశ్నలపై నిహరిక స్పందించింది. నాగశౌర్యకి, తనకి మధ్య అదేం లేదనీ, మిగిలిన కో-ఆర్టిస్టుల్లానే నాగశౌర్య కూడా తనకు ఒక మంచి మిత్రుడని చెప్పింది.

అంతకు మించి తమ మధ్య మరేం లేదని స్పష్టం చేసింది. గతంలో వేరెవరితోనో తనకు లింక్ పెట్టారని, ఇప్పుడు నాగశౌర్యకూ, తనకూ లింక్ పెడుతున్నారని చెప్పింది.ఆఖరికి తన కజిన్స్‌తో కూడా ముడిపెట్టి ఇష్టం వచ్చినట్టు వార్తలు రాశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా ఛలో సినిమా ప్రమోషన్స్ సమయంలో వీరి ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నించగా నాగశౌర్య కూడా ఇలాగే చెప్పుకొచ్చాడు.మొదట్లో తనకి రాశీ ఖన్నాతో లవ్ ఎఫైర్ ఉందన్నారని, ఇప్పుడు నీహారికతో ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నిస్తున్నారని చెప్పాడు.

పైగా ఛలో ముందస్తు వేడుకలో కూడా చిరంజీవిని పొగుడుతూ మరో జన్మంటూ ఉంటే చిరు అభిమానిగా పుడతా అని చెప్పడంతో ఈ పెళ్లి పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.

ఇప్పుడు నిహరిక చెప్పిన సమాధానం కూడా ఒకటే కావడంతో వీరి మధ్య ఏదో ఉందనే అభిప్రాయం బలపడేలా ఉంది.