నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ సినిమా .............?

నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ సినిమా .............?

నందమూరి ఫ్యామిలీకి చెందిన ముగ్గురు స్టార్లు ఒకే సినిమాలో కలిసి నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. హీరోగా, నిర్మాతగా ఆకట్టుకుంటున్న నందమూరి కళ్యాణ్ రామ్‌ ప్రస్తుతం ఎమ్మెల్యే, నా నువ్వే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తరువాత దర్శకుడు పవన్‌ సాధినేని తో  ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాను కళ‍్యాణ్ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ సోదరుడు ఎన్టీఆర్‌, తండ్రి హరికృష్ణలు అతిథి పాత్రల్లో నటించనున్నారట. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.