అజ్ఞాతవాసి ఫ్లాప్ ఎక్కువగా ఎవరిని బాధిస్తుంది

అజ్ఞాతవాసి ఫ్లాప్ ఎక్కువగా ఎవరిని బాధిస్తుంది

అను ఇమ్మానుయేల్ పేరు వినగానే కుర్రకారులో ఓ రకమైన పులికింత , సంతోషం. ఆమె నటన కంటే బాడీ లాంగ్వేజ్ కట్టిపడేస్తుందనే చెప్పాలి . మరో ఇలియానాలా యూత్ ను మరిపిస్తోంది.

అలాంటి చక్కని చుక్కకు సరైన హిట్ లు తగలక కెరీర్ లో ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. సన్నని చక్కటైన నడుముతో అచ్చు ఇలియానాలా వుండే, అను ఇమ్మానుయేల్, ప్రస్తుతం టాలీవుడ్ కథానాయికల్లో కుర్రకారు గుండెల్లోతనదయిన ముద్రవేసిన నటి.

తన మొదటి చిత్రం మజ్ను తోనే అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు ఆమె. అయితే ఇప్పటివరకు ఆమె మంచి విజయాన్ని తెలుగు లో అందుకోలేదనే చెప్పాలి.

ఇటీవల పవన్ కళ్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాయజయం కావడంతో ఆ ప్రభావం ఆమె తదుపరి అవకాశాల పై పడుతోందని తెలుస్తోంది.

అజ్ఞాతవాసి చిత్రీకరణ సమయంలోనే తన తదుపరి ఎన్టీఆర్ చిత్రం కోసం అనునే హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకున్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రం పరాజయం పాలవడంతో ఆమె పై ప్లాప్ ముద్ర పడిందని, అది తన తదుపరి చిత్రం పై ఉండకూడదని త్రివిక్రమ్ ఆమె స్థానం లో శ్రద్ధ కపూర్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయానికి సంబంధించి అధికార ప్రకటన వెలువడితే కానీ నిజా నిజాలు తెలియవని సినీ వర్గాలు అంటున్నాయి…. గతంలో ఇలియాన కి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

పోకిరి హిట్ తో అప్పట్లో నెంబర్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ తర్వాత రెమ్యునరేషన్  భారీగా పెంచటంతో  క్రమేపీ అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే.