సాక్ష్య౦ మూవీ రివ్యూ
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, బ్రహ్మాజీ, రవికిషన్
ఛాయాగ్రహణం : ఆర్ధర్ ఎ.విల్సన్
మాటలు : సాయిమాధవ్ బుర్రా
సంగీతం : హర్షవర్ధన్
రచన-దర్శకత్వ౦ : శ్రీవాస్
నిర్మాత : అభిషేక్ నామా
సంస్థ : అభిషేక్ పిక్చర్స్
బెల్లంకొండ శ్రీనివాస్.. చేసిన కొత్త ప్రయత్న౦ `సాక్ష్య౦`. సృష్టిలో జరిగేదానికి నాలుగు దిక్కులే కాదు.. ప్రకృతి కూడా సాక్ష్య౦. పంచభూతాలే కర్మకి సాక్షి అనే అంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? ఏ మేరకు ఆకట్టుకుంది? అని తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం..
కథ : స్వస్తిక్ పురం గ్రామంలోని రాజుగారు(శరత్‌కుమార్) పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి. అదే ప్రాంతంలో ఉండే మునుస్వామి అతని తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అతని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. అయితే రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడటంతో తప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్రకాశ్(జయప్రకాశ్) చెంతకు చేరుతాడు. పిల్లలు లేని శివ ప్రకాశ్ ఆ పిల్లాడికి విశ్వజ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు. విశ్వ విదేశాల్లో పెరిగి పెద్దవాడవుతాడు. 20ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చి, తనకు తెలియకుండానే తన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ కథ.
విశ్లేషణ : గాలి, నిప్పు, నేల, మట్టి, ఆకాశం.. ఈ పంచభూతాలు మనిషిని సృష్టిస్తాయి, నాశనం చేస్తాయి. ప్రకృతి ధర్మాన్ని మనం పాటిస్తే మన ఉన్నతికి తోడ్పడుతాయి. వాటిని అతిక్రమిస్తే అంతం చేస్తాయి. పంచ భూతాలను యాక్షన్ ఎపిసోడ్‌లో మేళవించాలన్న ఆలోచన రొటీన్ కథను సరికొత్తగా ఆవిష్కరించింది. కథానాయకుడికి తన గతం తెలియకుండా దాస్తూనే, తనకు అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేలా చూపించడం కొత్త ఎత్తుగడ. పంచ భూతాలకు సంబంధించిన లింకులన్నీ సరిగానే వేసుకున్నాడు. అయితే, మధ్యమధ్యలో సినిమాను మరింత కమర్షియల్ చేయడానికి పాటలను ఇరికించాడేమో అనిపిస్తుంది. సినిమా సినిమాకీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న ఆలోచన సాయి శ్రీనివాస్‌కు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. పూజా హెగ్డే పాటల్లో ఒకలా, సన్నివేశాల్లో మరోలా కనిపించింది.
ప్లస్ పాయింట్స్ : విజువల్స్
మేకింగ్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ : ప్రథమార్ధం
రేటింగ్ : 2.75/5
మరిన్ని కథనాలు
భార్యతో కలిసి...
జూలై 20న...
బంగారి బాలరాజు...
