లైఫ్ పార్టనర్ కోసం ప్రదీప్ బిగ్ బాస్ హౌస్ లో
బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 40 ఫుల్ జోష్‌తో గురువారం ప్రారంభమైంది. తేజస్వి, దీప్తి సునైనా, దీప్తి మాస్ స్టెప్పులతో రచ్చచేశారు. ముఖ్య౦గా బుల్లి నిక్కరుతో తేజస్వి బాక్ బస్టర్ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోకుండా చేసింది.
ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా టాస్క్ గత రెండు రోజులుగా ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ ఎపిసోడ్‌లో సినిమాకి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక బృందానికి పారితోషికాన్ని ఇచ్చే బాధ్యతను అమిత్, బాబు గోగినేనిలకు అప్పగించారు బిగ్ బాస్. చివరికి ఎవరి వద్ద ఎక్కువ పారితోషికం ఉంటుందో వాళ్లే ఈ టాస్క్ విన్నర్ అవుతారని బిగ్ బాస్ చెప్పారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన మొత్తం పారితోషికంలో సగం అమిత్, బాబు గోగినేనిలు పక్కనపెట్టుకుని మిగిలిన మొత్తాన్ని నటీనటులకు చెల్లించారు.
ఇక నేటి ఎపిసోడ్‌లో యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఉండటంతో ప్రేక్షకుల ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ప్రదీప్ ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారా అని ఎదురు చూస్తున్న సందర్భ౦లో లగేజ్‌తో సహా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చారు ప్రదీప్. వచ్చీ రావడంతోటే తనదైన శైలి టైమింగ్ పంచ్‌లతో బిగ్ బాస్ హౌస్‌లో చెడుగుడు ఆడేశాడు. పంచ్‌ల ప్రవాహంతో బిగ్ బాస్ హౌస్ హోరెత్తించాడు. గ్యాప్ లేకుండా టైమింగ్ డైలాగ్‌లతో బిగ్ బాస్ హౌస్‌కి ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు.
ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రదర్శనను యాంకర్ ప్రదీప్‌తో పాటు హౌస్ మేట్స్ అందరూ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా చూసిన ప్రదీప్.. కంటెస్టెంట్స్‌ను అభినందించారు. ‘పెళ్లి చూపులు’ అనే టెలివిజన్ షో ప్రమోషన్‌లో భాగంగా అక్కడకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఇది కేవలం షో మాత్రమే కాదని.. తన లైఫ్ పార్టనర్ అన్వేషణ కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు ప్రదీప్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా బిగ్గెస్ట్ ఫ్యాన్ తన లైఫ్ పార్టనర్‌గా రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు ప్రదీప్. ఈ సందర్భ౦గా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ప్రదీప్.
మొత్తానికి ప్రదీప్ రాకతో గురువారం నాటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి.
మరిన్ని కథనాలు

అమిత్‌కు సీక్రెట్...
Men’s Day Special: South Film Industry Maga Maha...
