నటి శ్రీరెడ్డి అర్ధనగ్న౦గా నిరసన
గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌లలో హంగామా చేస్తుంది నటి శ్రీరెడ్డి. తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. ‘మా’ సభ్యత్వ౦తో పాటు తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వాలని చాంబర్ ఆవరణలో అర్ధనగ్న౦గా నిరసన తెలిపింది.
ఈ సందర్భ౦గా మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. సీఎం కేసీఆర్ గారూ మీరు స్పందించకపోతే.. నడిరోడ్డుపై నగ్న౦గా నిలబడుతానని చెప్పింది. ఈ సందర్భ౦గా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది.'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాదించారు. అలాగే నేను కూడా నిరాహార దీక్ష చేస్తాను.మీరు అప్పటికి స్ప౦దించకపోతే, పబ్లిక్ లో నగ్న౦గా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.
మరిన్ని కథనాలు
బిజీ అవుతున్న రాశి
శ్రీ రెడ్డి కి...
శేఖర్ కమ్ములకు...
