వినయ విధేయ రామ ఫస్ట్ సాంగ్ రిలీజ్

వినయ విధేయ రామ ఫస్ట్ సాంగ్ రిలీజ్

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్నపూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న  సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వాని ఆడిపాడుతోంది. చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. దేవి శ్రీ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దీంతో మరో అప్‌డేట్ ఎప్పుడొస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. ‘‘తందానే తందానే’’ అంటూ సాగిపోనున్న ఈ ఫ్యామిలీ సాంగ్‌ని డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్‌ ద్వారా తెలిపారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.