బెల్లంకొండ యాక్షన్ మూవీ 'కవచం '

బెల్లంకొండ యాక్షన్ మూవీ 'కవచం '

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా వంశధార క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం కవచం’. శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ చౌదరి సొంటినేని (నాని) నిర్మాత. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ పూర్తయింది.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబరు 7న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. యువ పోలీసు అధికారి పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అభినయం ఆకట్టుకుంటుంది. కవచం లాంటి పాత్రలోనే ఆయన సందడి చేస్తార’’ని చిత్రవర్గాలు చెప్పాయి. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌.