fingoshop
fingoshop

నటి శ్రీరెడ్డి అర్ధనగ్న౦గా నిరసన

గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని  ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో హంగామా చేస్తుంది నటి శ్రీరెడ్డి. తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. ‘మా’ సభ్యత్వతో పాటు తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వాలని చాంబర్‌ ఆవరణలో అర్ధనగ్నగా నిరసన తెలిపింది.

 ఈ సందర్భగా మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి.. సీఎం కేసీఆర్ గారూ మీరు స్పందించకపోతే.. నడిరోడ్డుపై నగ్నగా నిలబడుతానని చెప్పింది. ఈ సందర్భగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది.'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాదించారు. అలాగే నేను కూడా నిరాహార దీక్ష చేస్తాను.మీరు అప్పటికి  స్పదించకపోతే, పబ్లిక్ లో నగ్నగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.