"హ్యాపీ వెడ్డింగ్" మూవీ రివ్యూ

నటీనటులు : సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల, మురళీ శర్మ, నరేష్‌, పవిత్ర లోకేష్‌, తులసి, ఇంద్రజ, అన్నపూర్ణ తదితరులు

సంగీతం : శక్తికాంత్‌ కార్తీక్‌

నేపథ్య సంగీతం : తమన్‌

సాహిత్య : సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి

ఛాయాగ్రహణం : బాల్‌రెడ్డి

ఎడిటింగ్‌ : కె.వి. కృష్ణారెడ్డి

నిర్మాత : ఎం. సుమంత్‌ రాజు

రచన-దర్శకత్వ : లక్ష్మణ్‌

సంస్థ : పాకెట్‌ సినిమా, యూవీ క్రియేషన్స్‌

తనకు సరిపోయే కథలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్న యువ కథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌. ఇక మెగా కుటుంబ నుంచి బుల్లితెరపైకి వచ్చి, ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌లతో తన సత్తా చాటుతోంది నిహారిక కొణెదల. ‘ఒక మనసు’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో మెప్పించారు. ఇక వీరి ఇద్దరి కలయిక లో వచ్చిన సినిమా హ్యాపీ వెడ్డింగ్. ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌కుడు. చిన్న సినిమాను యువీ క్రియేష‌న్స్ స‌మ‌ర్పించ‌డం ఆస‌క్తి క‌ర విష‌యం. పెళ్లి జంటగా నటించిన సుమంత్‌ అశ్విన్‌, నిహారిక ఏ మేరకు ఆకట్టుకున్నారు? అనేది చూద్దాం. 

కథ : ఆనంద్ (సుమంత్ అశ్విన్) జింగిల్స్ కి రాస్తుంటాడు. విజ‌య‌వాడ అబ్బాయి. అక్ష‌ర (నీహారిక‌) హైద‌రాబాద్ అమ్మాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి నిశ్చితార్థం జ‌రుగుతుంది. పెళ్లి ఇంకొన్ని రోజుల్లో ఉందనగా, అక్షరలో లేనిపోని కన్‌ఫ్యూజన్లు మొదలవుతాయి. పెళ్లయిన తర్వాత తన స్వేచ్ఛ, ఇష్టాయిష్టాలకు దూరంగా ఉండాలేమోనన్న భయం ఆమెలో ఆవరిస్తుంది. తన పట్ల ఆనంద్‌ చిన్నపాటి అలసత్వ చూపించినా భరించలేకపోతుంది. ఈలోగా, తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ మల్లి.. అక్షర జీవితంలోకి వస్తాడు. ఇన్ని తికమకల మధ్య అక్షర ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అక్షరను ఆనంద్‌ ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది కథ.

విశ్లేషణ : పెళ్లి అనగానే చాలా మంది అమ్మాయిల్లో ఉండే కన్‌ఫ్యూజన్లు, భయాలు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయన్నదే సినిమా. నీహారిక పాత్ర మెప్పిస్తుంది. సుమంత్ కూడా త‌న పాత్ర‌లో మెప్పించారు. క‌న్‌ఫ్యూజ్డ్ అమ్మాయిగా నిహారిక‌, ఓపిక‌మంతుడిగా హీరో చాలా బాగా న‌టించారు. అమ్మాయి తండ్రి పాత్ర‌లో ముర‌ళీశ‌ర్మ‌, అబ్బాయి తండ్రిగా న‌రేశ్‌, కూతుర్లు లేని అమ్మ‌గా ప‌విత్రాలోకేశ్‌, నోటి దూల ఉన్న బామ్మ‌గా అన్న‌పూర్ణ‌మ్మ‌.. అంద‌రూ బాగా న‌టించారు. పాటలన్నీ కథలో భాగంగా వచ్చేవే. పెళ్లి వాతావరణాన్ని కెమెరాలో అందంగా బంధించారు. దర్శకుడు ప్రధాన బలం మాటలు. 

ప్లస్ పాయింట్స్ : సుమంత్ అశ్విన్, నీహారిక‌ నటన 

                             నేప‌థ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :  స్క్రీన్‌ప్లే

రేటింగ్ : 3/5


మరిన్ని కథనాలు

"హ్యాపి వెడ్డింగ్"...
కూతురు తో...
పంతం మూవీ రివ్యూ
మొదటి షెడ్యూల్ ...
దేశముదుర్స్...