‘అభిమన్యుడు’ మూవీ రివ్యూ

నటీనటులు : విశాల్‌, సమంత, అర్జున్‌, శ్రీజ రవి, రోబో శంకర్‌ తదితరులు 

సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా 

సినిమాటోగ్రఫీ : జార్స్‌ సి.విలియమ్స్‌ 

ఎడిటింగ్‌ : రుబెన్‌ 

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ : పి.ఎస్‌.మిత్రన్‌ 

నిర్మాత : విశాల్‌

బ్యానర్‌ : విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ 

ఇటవలే ‘డిటెక్టివ్‌’ అంటూ ఓ కొత్త తరహా కథతో ఆకట్టుకున్న ఆయన తాజాగా లక్షల మంది నిత్య ఎదుర్కొంటున్న సైబర్‌ మోసాల నేపథ్యలో తీసిన చిత్రం ‘అభిమన్యుడు’. ‘ఇరుంబు తిరై’గా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. అంద‌రూ డిజిట‌ల్ ఇండియా అంటుంటే.. అందులోని మ‌రో కోణాన్ని ట‌చ్ చేసే ప్ర‌య‌త్న చేశారు విశాల్, ద‌ర్శ‌కుడు మిత్ర‌న్. ఈ సినిమాకు డిజిట‌ల్ ఇండియా, ఆధార్ కార్డ్‌కి వ్య‌తిరేకంగా ఉంది అంటూ త‌మిళంలో విడుద‌ల‌కు చాలా ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. ఆటంకాల‌ను దాటిన అభిమ‌న్యుడు త‌మిళ వెర్ష‌న్ మంచి విజ‌యాన్ని సాధించింది. మ‌రి తెలుగులో అభిమ‌న్యుడు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? లేదా? అని తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం

కథ : కరుణ(విశాల్) ఆర్మీ మేజర్‌. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆవేశపరుడైన ఆఫీసర్‌. కుటుంబ సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కరుణ ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో లోన్‌ తీసుకోవాల్సి వస్తుంది. కానీ తీసుకున్న లోన్‌ డబ్బులు నిమిషాల్లోనే బ్యాంక్‌ ఎకౌంట్‌ నుంచి మాయం అవుతాయి. దీంతో హీరో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. పోలీసుల ద‌గ్గ‌ర‌కు వెళ్లినా తాను కూడా ఏజెంట్ కార‌ణంగా ఉచ్చులో ఉండ‌టంతో ఏం చేయ‌లేక‌పోతాడు. చివ‌రకు నెమ్మ‌దిగా త‌న డ‌బ్బును కాజేందెవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్న చేస్తాడు. ఆ స‌మ‌యంలో వైట్ డెవిల్‌(అర్జున్‌) దీని వెనుక ఉన్నాడ‌ని తెలుసుకున్న క‌రుణాక‌ర్ ఏం చేస్తాడు? వైట్ డెవిల్ అంద‌రినీ ఎలా మోసం చేస్తున్నాడు? క‌రుణాక‌ర్‌.. వైట్ డెవిల్‌ను ప‌ట్టుకున్నాడా? లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ : దర్శకుడు మిత్రన్‌ నేటి డిజిటల్‌ లైఫ్‌కు తగ్గ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశాల్ బాడీ లాంగ్వేజ్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమన్యుడు సినిమాను రూపొందించాడు. ముఖ్యగా సైబర్‌ క్రైమ్‌ కు సంబంధించి సన్నివేశాలను తెరకెక్కించేందుకు మిత్రన్‌ చేసిన పరిశోధన తెర మీద కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎలా చోరికి గురవుతుందన్న అంశాలను చాలా బాగా చూపించాడు. ఈ సినిమా చూసిన త‌ర్వాత మ‌న ఫోన్ హ్యాక్ అయ్యిందేమో అనే అనుమానం క‌లుగ‌క మాన‌దు. చాలా వివ‌రాలు మ‌న ఫోన్ నుండి ఇత‌రుల‌కు వెళ్లిపోతుంది. మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న ఫోన్ ద్వారానే మ‌న వీడియోలు, ఆడియో రికార్డు తీసుకోవ‌చ్చు. టెక్నాల‌జీ పెరిగే కొద్ది మ‌న‌లో జాగ్ర‌త్త కూడా పెర‌గాలి. ఎవ‌డికి ప‌డితే వాడికి, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ‌న వివ‌రాల‌ను ఇచ్చేయ‌కూడ‌దు. మ‌న సంత‌కాలు గుడ్డిగా పెట్ట‌య‌కూడ‌దు అనే విష‌యం తెలుస్తుంది.

ప్లస్ పాయింట్స్ : విశాల్‌-అర్జున్‌ల నటన 

                         సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్ : తొలి భాగం 


మరిన్ని కథనాలు

రిపోర్టర్ ఫై...
ఈ సినిమా మొదలు...
నేల టిక్కెట్టు గాల్లు వీలలు వేస్తే స్టార్ హీరోయిన్ అయినట్టే
నేల టిక్కెట్టు ...
అమ్మో అమ్మోరు మూవీ...
బిగ్ బాస్ 2 లో కొత్త...
ట్విట్టర్ కు బై బై...