మళ్ళీ టార్గెట్ అయిన కౌశల్‌

బిగ్ బాస్ సీజన్ 2 79 వ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ ప్రక్రియ అత్యంత రసవత్తరంగా సాగింది. హౌస్ లో పదిసార్లు బెల్ మోగుతుంది. బెల్ మోగిన ప్రతి సారి ప్రతి ఒక ఇంటి సభ్యుడూ.. ముగ్గురు కంటెస్టెంట్స్‌ని యాక్టివిటీ ఏరియాలోకి తీసుకెళ్లి.. అక్కడ కారణాలు చెప్తూ.. ఒకరిని సేవ్ చేసి.. ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక ఇంటి సబ్యులు ఎవరెవరు ఎవరెవరిని నామినేట్ చేసారో చూద్దాం.

దీప్తి నల్లమోతు - సామ్రాట్, అమిత్‌లను నామినేట్ చేసి రోల్ రైడాని సేవ్ చేసింది. 

శ్యామల - గణేశ్, నూతన్ నాయుడు‌లను నామినేట్ చేసి తనీశ్‌ని సేవ్ చేసింది. 

నూతన్ నాయుడు - అమిత్, సామ్రాట్‌లను నామినేట్‌‌‌ని చేసి కౌశల‌్‌ను సేవ్ చేశాడు.

గీతా మాధురి - నూతన్ నాయుడు, కౌశల్‌ని నామినేట్ చేసి అమిత్‌ని సేవ్ చేసింది. 

సామ్రాట్ - కౌశల్, నూతన్ నాయుడులను నామినేట్ చేసి శ్యామలను సేవ్ చేశాడు. 

అమిత్ - నూతన్ నాయుడు, గణేశ్‌లను నామినేట్ చేసి కౌశల్‌ని సేవ్ చేశాడు.

తనీశ్ - కౌశల్, నూతన్ నాయుడులను నామినేట్ చేసి రోల్‌రైడాని సేవ్ చేశాడు.

తనీష్ నూతన్ నాయుడు ని నామినేట్ చేస్తూ అందుకు గల కారణాలు ఇలా అన్నారు.. మీరు బయట ఉన్న సమయంలో శపథం చేశారని శ్యామల తెలిపింది. అది కరెక్ట్ కాదు సార్. మీరు అలాంటి వ్యక్తి కాదు అని ఈ నామినేషన్ ద్వారా నిరూపించుకోండి అని తనీష్ తెలిపాడు. తనీష్ ఆ మాట అనడంతో నూతన్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. పక్కనే ఉన్న కౌశల్, రోల్ రైడ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

రోల్ రైడా - నూతన్ నాయుడు, కౌశల్‌ని నామినేట్ చేసి గణేశ్‌ని సేవ్ చేశాడు. 

గణేశ్ - అమిత్, కౌశల్‌లను నామినేట్ చేసి గీతా మాధురి‌ని సేవ్ చేశాడు. 

కౌశల్ - గణేశ్, సామ్రాట్‌లను నామినేట్ చేసి, అమిత్‌ను సేవ్ చేశాడు. 

ఇక గణేష్ ని ఎందుకు నామినేట్ చేశానో అని కౌశల్ వివరిస్తుండగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నీలాంటి సోమరిపోతులకు బిగ్ బాస్ లో ఆస్కారం లేదు. అందుకే నిన్ను నామినేట్ చేశా అంటూ గణేష్ కు చురకలు అంటించాడు.

ఈ వారం నామినేషన్స్‌లో కౌశల్, నూతన్ నాయుడు, గణేశ్, సామ్రాట్, అమిత్‌లు నిలిచారు.