దీప్తి సునైన తో ఆడుకున్న విజయ్‌...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఎపిసోడ్ 71 లో దీప్తి సునైన ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయింది.

గీత గోవిందం ప్రమోషన్స్‌లో భాగంగా షోకి అతిథిగా వచ్చిన విజయ్‌ దేవరకొం, నాని కలిసి దీప్తి సునయను సీక్రెట్‌ టాస్క్‌ పేరిట బాగానే ఆడుకున్నారు. ఫోన్‌లో చెప్పినట్టుచెయ్యాలని నాని ఆదేశించాడు. దీప్తి సునయనకు ఓ బ్లూటూత్‌ను ఇచ్చి చెవిలో పెట్టుకుని, కనబడకుండా తన జుట్టుతో కవర్‌ చేసుకోవాలని చెప్పాడు. వారు బయట నుంచి ఫోన్‌లో చెప్పినట్టుగా తాను హౌజ్‌లో చేయాలని మధ్యలో కాల్‌ డిస్‌ కనెక్ట్‌ అయితే వెంటనే బాత్‌రూమ్‌కు వచ్చి కాల్‌ కనెక్ట్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇక నాని, విజయ్‌లు ఇద్దరు కలిసి దీప్తి సునయని ఆడుకోవడం మొదలుపెట్టారు.

మీ అక్క పెళ్లి గురించి విని ఎమోషనల్ అయి ఏడుస్తున్నట్లు నటించు... అని విజయ్ చెప్పడంతో సునైనా అలానే చేసింది. దీంతో ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయి అందరూ ప్రేమతో హగ్ చేసుకుంటుంటే..... విజయ్ సరదా కామెంట్స్ చేశారు. హగ్గులు అందరికీ ఇస్తున్నారా? నీకు మాత్రమే ఇస్తున్నారా? ఎవడైనా హగ్ ఇస్తే వచ్చి కొట్టేస్తా అంటూ ఆట పట్టించారు.

సీక్రెట్ టాస్క్‌లో భాగంగా తనీష్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి దూకమని చెప్పగా ఎందుకు అని అడిగాడు. ఎలిమినేషన్‌ కాకుండా ఉండటానికి అని దీప్తి చెప్పగా వెంటనే స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాడు. అనంతరం విజయ్‌, డైరెక్టర్‌ పరుశురామ్‌లు ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటించారు. 

ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న ఆరుగురిలో నిన్న శ్యామల, గీతా మాధురిలు సేఫ్ కాగా.. మిగిలిన దీప్తి సునయన, నూతన్ నాయుడు, రైడా, పూజాలలో నేడు ఎలిమినేట్ అయ్యింది దీప్తి సునయన. అందరూ దీప్తిని కౌగిలించుకొని బాధను పంచుకొన్నారు. తనీష్ కంటనీరు పెట్టుకొని బావోద్వేగానికి గురయ్యాడు.

తనీష్‌పై సునైనా బిగ్‌బాంబ్ వేసింది. ఈ బిగ్‌బాంబ్‌ ప్రకారం తనీష్ ఉదయం పాట ప్లే చేయగానే లేచి స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి.
ఇక నేటి ఎపిసోడ్ లో ఈ వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. మరి ఎవరు నామినేషన్‌లోకి వెళ్తారో? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.