జులై 27 న సాక్ష్య౦ గ్రాండ్ రిలీజ్..!!
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్.
డైరెక్టర్ : శ్రీవాసు
బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్
నిర్మాత : అబిషేక్ నమ
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వరన్
కెమెరామెన్ : ఆర్థర్ ఏ విల్సన్
ఆర్ట్ : ఏఎస్. ప్రకాష్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
యాక్షన్ : పీటర్ హెయిన్
పి.ఆర్.ఓ : వంశీ - శేఖర్
లిరిక్స్ : అనంత శ్రీరామ్
ఆడియో : జంగ్లీ మ్యూజిక్
సాక్ష్య౦ మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా జులై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వ౦లో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్ప౦దన వచ్చింది..ముఖ్య౦గా 12 నిమిషాల పంచభూతలు సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనా లు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
మరిన్ని కథనాలు
DJ-Duvvada Jagannadham trailer Review: Allu Arjun,...
వాలెంటైన్స్ డే...
Box Baddalai Poye Making Song released : Allu...
Why did Pooja Hegde turn down Bunny-Harish’s...
