నేను ఆరోగ్య౦గానే ఉన్నాను
కథానాయకుడు రానా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తున్నారని రజనీకాంత్‌కి చెకప్ చేస్తున్న వైద్యుడే రానాకూ చికిత్స అందిస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై రానా స్ప౦దించారు. తాను ఆరోగ్య౦గా, ధృఢంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘నా ఆరోగ్య౦ విషయంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నాకు బ్లడ్ ప్రెషర్ సమస్య ఉందని, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుండటం వలన కంటి సర్జరీ కూడ ఆలస్యమైందని, అంతేగాని అంతకు మించి తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అన్నారు'.
మరిన్ని కథనాలు
నాగార్జున - రామ్...

మనం సైతం టీషర్టు...
