మను మూవీ రివ్యూ
నటీనటులు : రాజా గౌతమ్, చాందినీ చౌదరి, జాన్ కోట్లే, అభిరామ్, మోహన్ భగత్ తదితరులు
సంగీతం : నరేష్ కుమారన్
ఛాయాగ్రహణం : విశ్వనాథ్‌రెడ్డి
కూర్పు : ఫణీంద్ర నరిశెట్టి
దర్శకత్వ౦ : ఫణీంద్ర నరిశెట్టి
నిర్మాణం : ది క్రౌడ్
సమర్పణ : నిర్వాణ సినిమాస్
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజా గౌతమ్ హీరోగా మాత్రం పెద్ద సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. వైవిధ్యమైన సినిమాలు చేయాలని గట్టి సంకల్ప౦తో ఉన్న రాజ గౌతం మరి మను సినిమాతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాడో చూద్దాం.
కథ : మను (రాజా గౌతమ్) ఓ చిత్రకారుడు. ఏదో విషయంలో తనలో తానే మధనపడుతుంటాడు. నీల (చాందినీ చౌదరి) మనుని ఇష్టపడుతుంది. తన కళని ఆరాధిస్తుంది. అయితే అనుకోని పొరపాటు వల్ల మనుని అపార్థం చేసుకుంటుంది. దాన్ని తెలుసుకుని మనుకి దగ్గరయ్యే క్రమంలో ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఇంతకు మను, నీల ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు? ఇద్దరి మధ్య ప్రేమ ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : రాజా గౌతమ్ చాలా కాలం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ పాత్ర కోసం మూడేళ్లు కష్టపడినట్టు చెప్పాడు. చాందిని కూడా తన నటన తో ఆకట్టుకుంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ.. నరేశ్ కుమరన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం అనడంలో అతిశయోక్తి లేదు. అయితే దర్శకుడు ఫణీంద్ర కథను రాసుకున్నప్పుడు ఉన్న౦త గొప్పగా తెరపై చూపించలేదు.
ప్లస్ పాయింట్స్ : లవ్ సీన్స్
మైనస్ పాయింట్స్ : స్క్రీన్ ప్లే
రేటింగ్ : 2/5
మరిన్ని కథనాలు
నాని "లిటిల్...
భార్యతో కలిసి...
