‘లవర్’ మూవీ రివ్యూ
నటీనటులు : రాజ్ తరుణ్, రిద్ధి కుమార్, రాజీవ్ కనకాల, సత్య౦ రాజేశ్, సత్య, సుబ్బరాజు, అజయ్, సచిన్ ఖేడేకర్, ప్రవీణ్ తదితరులు
సంగీతం : అంకిత్ తివారీ, ఆర్కో ప్రావో ముఖర్జీ, రిషీ రిచ్, అజయ్ వాస్, సాయికార్తీక్, తనిష్ భాగ్చి
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
కూర్పు : ప్రవీణ్ పూడి
కళ : ఏఎస్ ప్రకాష్
సాహిత్య౦ : సిరివెన్నెల సీతారామశాస్త్రి
రచన, దర్శకత్వ౦ : అనీశ్ కృష్ణ
నిర్మాత : హర్షిత్‌రెడ్డి
బ్యానర్ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్ లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన రాజ్ తరుణ్ తాజాగా లవర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా అనీష్ కృష్ణ దర్సకత్వ౦ వహించారు. గత కొన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్‌కి ఈ సినిమా ఆ కోరికను తీరుస్తుందా? లేదా ...? అన్నది చూద్దాం.
కథ : రాజ్ (రాజ్‌తరుణ్) ఒక అనాథ. జగ్గు (రాజీవ్ కనకాల)ని తన సొంత అన్నగా భావిస్తూ అతని కుటుంబంతోనే కలిసి జీవిస్తుంటాడు. బైక్ మెకానిక్ అయిన రాజ్, హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తున్న చరిత (రిద్ధి కుమార్)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా రాజ్‌ని ప్రేమిస్తుంది. హాస్పిటల్ లో ఏ చిన్న తప్పు జరిగిన ఎదిరించి మాట్లాడే చరిత, లక్ష్మీ అనే అమ్మాయిని కాపాడే ప్రయత్న౦లో తన ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. చరిత కాపాడాలనుకున్న లక్ష్మీ ఎవరు..? ప్రభుత్వాన్నే గడగడలాండిచే వరదరాజులు (శరత్ కేడ్కర్)కు లక్ష్మీకి సంబంధం ఏంటి..? లక్ష్మీ, చరితలను రాజు ఎలా కాపాడాడు..? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ : ప్రేమించిన అమ్మాయిని కాపాడుకునే ప్రేమికుడిగా రాజ్‌తరుణ్ ఈజ్‌తో ఎనర్జిటిక్‌గా నటించాడు. అలాగే సినిమాలో రిద్దికుమార్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. రిద్దికుమార్ పాత్రలో ఒదిగిపోయింది. ఇక రాజీవ్ కనకాల నటించిన జగ్గూబాయ్ పాత్ర సెకండాఫ్‌లో కీలకంగా కనపడుతుంది. రాజీవ్ నటన గురించి చెప్పనక్కర్లేదు. దిల్‌రాజు సంస్థ విలువలకి ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని నిర్మించాడు హర్షిత్. కాకపోతే అనంతపురాన్ని కూడా హైదరాబాద్ రేంజ్‌లో రిచ్‌గా చూపించడంతో అక్కడక్కడా సహజత్వ౦ లోపించినట్టు అనిపిస్తుంది. దర్శకుడు అనీష్‌కృష్ణ రాసుకొన్న కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ, చాలా స్పష్టతతో, ఇంటిల్లిపాదికీ నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు.
ప్లస్ పాయింట్స్ : నటీనటుల నటన
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరీ
రేటింగ్ : 2.5/5
మరిన్ని కథనాలు
సావిత్రి బయోపిక్...
శర్వానంద్ "పడి పడి...
దొరికిందే ఛాన్స్...
