హరీష్ శంకర్ దర్శకత్వ౦ లో `సీటీమార్`
`గబ్బర్ సింగ్`తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వ౦లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం `దువ్వాడ జగన్నాథమ్`లోని `సీటీ మార్ సీటీ మార్.. ` అనే సాంగ్ ఎంత పాపులార్ అయ్యిందో మనకు తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సినిమాలో హిట్ సాంగ్‌లోని `సీటీమార్` అనే టైటిల్‌తో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుండటం విశేషం. హరీష్ శంకర్.. ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లో `దాగుడుమూతలు` అనే సినిమాను రూపొందించే పనిలో భాగంగా స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే `జవాన్` చిత్రాన్ని నిర్మించిన అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కొమ్మలపాటి కృష్ణ నిర్మాణంలో హీరష్ శంకర్ `సీటీమార్` సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో వరుస హిట్స్ సాధిస్తున్న యువ కథానాయకుడు ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు.త్వరలోనే చిత్ర యూనిట్ పూర్తి వివరాలను తెలియజేస్తుంది.
మరిన్ని కథనాలు
మార్చి 23న `ఆనందం`
ఫస్ట్ షెడ్యూల్...

‘భరత్ అనే నేను’లో...
అక్కినేని సమంత-ఆది...
