చిరు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి నట ప్రస్థానం టాలీవుడ్‌ని శాసించే మెగాస్టార్ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న నిరంతర కృషి, పట్టుదల అందరికీ తెలిసిందే. 150 సినిమాలతో, అలుపెరగని వీరుడిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు .
చిరంజీవి, సురేఖ దంపతుల వైవాహిక జీవితం 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 20 ఫిబ్రవరి, 1980లో అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను వివాహమాడారు చిరు. ఇటీవల షష్ఠిపూర్తి చేసుకున్న ఈ దంపతుల వైవాహిక జీవితం 38 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భ౦గ సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ నడుస్తుంది.
మరిన్ని కథనాలు
Filmmaker Srinu Vaitla gets ready to direct Ram...
