కమల్ ఛాన్స్ తో రెండు వారాలు సేఫ్ అయిన అమిత్
బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 55లో విశ్వనటుడు కమల్ హాసన్ హౌస్‌కి రావడంతో ఇంటి సభ్యులు తమ ఇష్టాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు. అందరూ కాళ్ల మీద పడి నమస్కరించారు. వారందరిని కమల్ హాసన్ ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. కొంతమంది హౌజ్‌మేట్స్‌కు అది కలో నిజమో గుర్తించలేనంత ఆశ్యర్యానికి లోనయ్యారు.
ఇక ఆగష్టు 10న లోకనాయుడు, భారతీయుడు, విశ్వనటుడు కమల్ స్వీయ దర్శకత్వ౦లో తెరకెక్కించిన ‘విశ్వరూపం 2’ మూవీ భారీ అంచనాల నడుమ ఆగష్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు కమల్.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో ప్లే చేయించారు. అనంతరం సినిమాకు పనిచేసిన మరికొంతమందిని కూడా హౌజ్‌లోకి విచ్చేశారు. హీరోయిన్ పూజా కూడా వచ్చారు. ఇంటి సభ్యులందరికి కమల్ హాసన్ విశ్వరూపం2 టీషర్ట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. తన టీమ్ సభ్యులైన మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, సినిమాటోగ్రఫర్ దత్, హీరోయిన్ పూజలను పరిచయం చేశారు.
బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిన కమల్ మాట్లాడుతూ.. ‘నేను బిగ్ బాస్ హౌస్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు. ఇది నా కుటుంబం లాగే ఉందంటూ తెలుగు ప్రేక్షకులతో ఉన్న మధురానుభూతిని పంచుకున్నారు.
అమిత్ తనకిష్టమైన ట్యూన్‌ను కమల్‌కు వినిపించాడు. రోల్‌రైడా తన స్టైల్లో ర్యాప్ పాడి హోరెత్తించాడు. గీతా మాధురి కూడా కమల్ హిట్ సాంగ్‌ను పాడి వినిపించారు. కౌశల్ కోరిక మేరకు.. భారతీయుడు సినిమాలోని ‘అదిరేటి డ్రేస్సు’ సాంగ్‌ను ఇంటి సభ్యులు ఆలపిస్తుండగా.. తనదైన శైలీలో కమల్ హాసన్ నడుస్తూ ఇంటి సభ్యులను ఆనందపరిచారు. తరువాత బిగ్ బాస్ హౌస్‌ను వీడుతూ కమల్ చేతుల మీదుగా రెండు వారాల బిగ్ బాస్ కార్డ్ అందుకున్నారు అమిత్. ఈ చాన్స్‌తో అమిత్ ఓ రెండు వారాలు సేఫ్ అయ్యాడు.
బిగ్ బాస్ హౌస్‌లో ఓ ఫన్నీ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. పాపులర్ తెలుగు సినిమా క్యారెక్టర్స్‌ను బిగ్ బాస్ హౌస్‌లో చేసి చూపించాలని అయితే ప్రతి క్యారక్టర్ కూడా హీరో మేస్ట్రో బైక్‌ను తమ స్కిట్‌లో ప్రాపర్టీగా యూజ్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ పూర్తైన తరువాత బిగ్ బాస్ హౌస్‌కి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, శ్యామలలు హౌస్ ప్రస్తుత పరిస్థితులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. గతంతో పోల్చుకుంటే హౌస్ చాలా కూల్‌గా ఉందని.. అయితే కౌశల్ మిగతా కంటెస్టెంట్స్‌తో కొంత ఇబ్బ౦ది పడుతున్నాడంటూ చెప్పుకొచ్చింది గీతా. ఇక తనకు తన తండ్రి, భర్త ఎలాగో హౌస్‌లో గీతా, శ్యామలలు కూడా అంతే అంటూ దీప్తి నల్లమోతు చెప్పడంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు ఇంటి సబ్యులు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నాని ఎంట్రీ ఎలిమినేషన్స్ ఉండడంతో మరింత ఆసక్తికరంగా ఉండనుంది.
మరిన్ని కథనాలు
Premam Fame Anupama Parameshwaran Bags A Big...
అ! మూవీ గురించి...
