నామినేషన్ ప్రక్రియలో ఇంటి సబ్యులకి గాయాలు
బిగ్‌బాస్ సీజన్ 2 58వ ఎపిసోడ్ లో బోనాల పండుగ సందర్భ౦గా హౌస్‌ని పూలతో అలంకరించారు ఇంటి సబ్యులు. తరువత నామినేషన్ ప్రక్రియ మొదలినది.
హౌస్‌లోని గార్డెన్‌లో ఓ టెంట్‌ని ఏర్పాటు చేసిన బిగ్‌బాస్.. మ్యూజిక్ ప్లే అయ్యే సమయంలో కంటెస్టెంట్స్ అందర్నీ ఆ టెంట్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లాలనే టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే టెంట్‌లోకి చివరలో ప్రవేశిస్తారో.. వారు నామినేట్ అయినట్లు ప్రకటించాలని కెప్టెన్ పూజా రామచంద్రన్‌కి సూచించాడు. ఈ నామినేషన్ నుంచి కెప్టెన్‌గా ఉండటంతో పూజా, కమల్ హాసన్ ఇచ్చిన సేవ్ కార్డు తో రెండు వారాల సేవ్ అయిన అమిత్‌కి మినహాయింపు ఇచ్చాడు.
తొలిసారి మ్యూజిక్ వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ పరుగెత్తగా.. బాబు గోగినేని చివరిగా ఉండిపోయాడు. ఆ తర్వాత తనీశ్, గీతా మాధురి, శ్యామల, గణేశ్, దీప్తి చివరిగా టెంట్‌లోకి వెళ్లి నామినేషన్స్‌లో నిలిచారు. చివర్లో దీప్తి, రోల్ రైడాలో ఎవరు ముందు టెంట్‌లోకి ప్రవేశించారు..? అనేదానిపై చర్చ జరగగా పూజ రోల్ రైడ కు సపోర్ట్ చేసి నామినేషన్ నుండి తప్పించింది. ఇక తనీశ్ లోపలికి వెళ్లిపోతుండగా.. అతని వెనుక ఉన్న సునైన కోసం తనీష్ టెంట్ లోపలి వెళ్ళకుండా త్యాగం చేసాడు. శ్యామల, దీప్తి, నూతన నాయుడికి గాయాలయ్యాయి. దీప్తి కాలికి తీవ్ర గాయమవడంతో డాక్టర్ వచ్చి చికిత్స చేసారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందో చూద్దాం...
ఈ వారం నామినేట్ అయిన ఇంటి సబ్యులు బాబు గోగినేని, తనీశ్, గీతా మాధురి, శ్యామల, గణేశ్, దీప్తి
మరిన్ని కథనాలు

అమిత్‌కు సీక్రెట్...

అ! మూవీ టీం స్పెషల్...

నందినికి లవ్ లెటర్...

నాని ని అన్న అని...
