ఈ వీక్ నందిని ఔట్... బిగ్ బాంబ్ ట్విస్ట్
బిగ్ బాస్ సీసన్ 2 ఎపిసోడ్ 57వ ఎపిసోడ్ ఫ్రెండ్ షిప్‌డే సందడితో మొదలైంది. ఫ్రెండ్ షిప్ డే రోజు మీతో డైరెక్ట్‌గా మాట్లాడాలని ఉంది కాని.. హౌస్‌లోకి ఇప్పుడు రావడం కుదరడం లేదు అని.. బిగ్ బాస్ హౌస్ గోడను నిచ్చెన ద్వారా ఎక్కి కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు నాని. ఫ్రెండ్ షిప్ డే సందర్భ౦గా తమ జీవితంలో జరిగిన స్వీట్ మెమొరీస్‌ను ప్రేక్షకులతో పంచుకున్నారు ఇంటి సబ్యులు.
‘ గూఢచారి, చి. ల . సౌ’ చిత్ర యూనిట్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. గూఢచారి హీరో అడవి శేష్, చి. ల. సౌ దర్శకుడు రాహుల్ రవీందర్ మంచి మిత్రులు కావడంతో తమ ఆనందాన్ని స్నేహితులు దినోత్సవం సందర్భ౦గా షేర్ చేసుకున్నారు.
ఇక ఈ వారం కీలకమైన ఎలిమినేషన్లో కౌశల్, బాబు గోగినేనిలు శనివారం ఎపిసోడ్ లో సేఫ్ జోన్లోకి రాగా.. గణేష్, దీప్తి, నందినిలు మాత్రమే మిగిలారు. వీళ్లలో తొలిత గణేష్ సేఫ్ జోన్లో ఉన్నట్టు ప్రకటించిన నాని.. తరువాత దీప్తిని కూడా సేఫ్ చేసి మిగిలిన నందినిని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్ అయింది. బిగ్ బాంబ్ శిక్ష ప్రకారం హౌస్‌లో ఉన్న వాళ్లకి మసాజ్ చేయాలని శిక్ష ఉండటంతో ఈ బిగ్ బాంబ్‌ను రోల్ రైడాపై విసిరింది నందిని. బిగ్ బాంబ్ ఏదైనా ఖచ్చితంగా కౌశల్‌పైనే విసురుతుందని భావించిన ప్రేక్షకులకు ట్విస్ట్ ఇచ్చింది నందిని.
మరిన్ని కథనాలు

సీక్రెట్ టాస్క్ లో...

కౌశల్ ఫ్యామిలీ...

Nani's Majnu Theatrical Trailer

పూజా ఎలిమినేషన్ కి...
