స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ కౌశల్ ఫై ఫైర్ అయిన బాబు
బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 48లోనూ బాబు గోగినేని కోపం ఏ మాత్రం తగ్గకుండా అందరి పైన ఉగ్రరూపం దాల్చారు. ఈ వారం లగ్జరి బడ్జెట్ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ను మూడు టీమ్స్‌గా విడిపోయి ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. స్విమ్మింగ్ ఫూల్లో ఉంచిన ఫాగ్ బాడీ స్ప్రేలను ఈదుతూ వెళ్లి గట్టున ఉండే వాళ్లకు ఇవ్వాలి. ఇలా ఎక్కువ ఫాగ్ బాడీ స్ప్రేలను ఎవరు సేకరిస్తారో వాళ్లే ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ విన్నర్. ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ కెప్టెన్ గీతా మాధురి పర్యవేక్షణలో జరుగుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. రంజుగా సాగిన ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో కౌశల్, సామ్రాట్, పూజా స్విమ్మింగ్ పూల్‌లో పోటీ పడగా.. కౌశల్ టీం విన్నర్‌గా నిలిచింది.
అయితే ఈ విజయానికి కానుకగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఈ సభ్యులకు వచ్చాయి...వీటిని మిగతా ఇంటి సభ్యులకు కూడా ఇవ్వొచ్చా అంటూ బిగ్‌బాస్‌ను అడుగుతుండగా విన్నానని అది తనకు నచ్చలేదని కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న గీతా మాధురికి తనీష్ చెప్పాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరిని కూర్చోబెట్టి సభాముఖంగా కౌశల్, దీప్తి, నందినిలను అడిగారు గీతా మాధురి. దీప్తి, నందినిలు తమకు ఎలాంటి అభ్య౦తరం లేదని చెప్పారు . కాని ఈ లగ్జరీ బడ్జెట్‌ను తమ టీం కష్టపడి గెలుచుకున్నా తనీష్, బాబు గోగినేనిలు కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదని కౌశల్ అనడంతో హౌస్‌లో పెద్ద వివాదం రేగింది.
బాబు గోగినేని స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ.. నేను కంగ్రాట్స్ చెప్పలేదు కాబట్టి.. నాకు లగ్జరీ బడ్జెట్ వచ్చిన ఐటమ్స్ వద్దు అని చెబుతుండగా.. నాకు కూడా వద్దంటూ తనీష్, సామ్రాట్లు తెలిపారు.
బాబు గోగినేని నాన్ సెన్స్ పదం వాడటంతో గీత హర్ట్ అయ్యారు. కెప్టెన్ పదవిపై గౌరవం ఉంటే.. కెప్టెన్ మాట్లాడుతుంటే మధ్యలో ఎవరూ మాట్లాడకూడదంటూ ఇంటి సభ్యులందరికి గీత సూచించారు. ఇక్కడ మాట్లాడేది నాన్ సెన్స్ కాదంటూ.. ఏదో ఎమోషనల్‌గా ఇష్టమొచ్చినట్లు ఒక మాట అనేసి జరిగే చర్చను పాడు చేయొద్దంటూ బాబు గోగినేనిని గీత కోరారు. తనకు నాన్సెన్స్ అనిపిస్తే మాట్లాడుతానని, తన పేరు వచ్చిన తరువాతే తాను మాట్లాడానంటూ బాబు ఫైర్ అయ్యారు.
టాస్క్ గెలిచిన తరువాత తన వద్దకు వచ్చి నేషనల్ స్విమ్మర్ కదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడని అందుకు తనకు కూడా లగ్జరి బడ్జెట్ వద్దని సామ్రాట్ తెలిపాడు.
ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నేను క్యాజువల్‌గానే అన్నానని తప్పు౦టే క్షమించమని కౌశల్ కోరాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అందరూ నెగిటివ్‌గా ఆలోచించడం వల్లే అలా అనిపిస్తోందని, పాజిటివ్‌గా ఆలోచిస్తే అంతా మంచి గానే కనిపిస్తుందని, అందరూ అలా ఆలోచించాలని సూచించగా.. బాబు గోగినేని, తనీష్ ఫైర్ అయ్యారు. మాటా మాటా పెరిగి మంచిగా మాట్లాడలంటూ కౌశల్ కూడా ఫైర్ అవుతుండగా... బెదిరిస్తున్నావా అంటూ బాబు కూడా రివర్స్ అటాక్ చేశాడు. ఇలా గొడవంతా తారాస్థాయికి చేరుతుండగా.. కెప్టెన్‌గా గీతా మాధురి అందరిని కంట్రోల్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు.
నేడు తనీష్ బ్రదర్ క్రిష్ బర్త్ డే కావడంతో బిగ్ బాస్ హౌస్‌కి కేక్ పంపించారు. దీంతో తనీష్ బాగా ఎమోషన్ అయ్యారు. కేక్‌తో పాటు తనీష్ తమ్ముడు, తల్లి రాసిన లేఖలను చదువుతూ కంటతడి పెట్టుకున్నాడు తనీష్.
మరిన్ని కథనాలు
