తేజూ ఔట్... కౌశల్‌పై సంచలన వ్యాక్యలు
ఎప్పటిలాగే బిగ్‌బాస్‌లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం ముందే లీకైంది. శనివారం జరిగిన షూటింగ్‌లోంచి వచ్చే లీకులు, బయటకు వచ్చిన తరువాత సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేసే ఫోటోల ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈజీగా తెలిసిపోతోంది. బిగ్‌బాస్ ఇంత కష్టపడి సస్పెన్స్ మెయింటెన్ చేయాలని చూస్తోన్నా.. ఈ లీకులు మాత్రం ఆగడం లేదు. బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం నాటి ఎపిసోడ్ 43లో తేజస్వి ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌ను వీడింది.
తేజస్వి ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్న సమయంలో బిగ్‌బాస్ హోస్ట్ నాని.. గత కొద్ది రోజులుగా కంటెస్టెంట్స్‌పై అసభ్యంగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లకి చురకలు అంటించాడు. ‘బిగ్‌బాస్ ఇంటిలోని సభ్యుడు మీకు నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. ఆ విషయాన్ని మీరు కామెంట్ల రూపంలో మాకు చెప్పొచ్చు. కానీ.. అసభ్య పదజాలంతో కంటెస్టెంట్స్‌పై కామెంట్లు చేస్తున్నారు. ముఖ్య౦గా తేజస్వి విషయంలో ఇలాంటి కామెంట్లు ఎక్కువగా వచ్చాయి. ఏంటి.. ఇలా మాట్లాడేవారు సమాజంలో ఉన్నారా..?’ అని నెటిజన్లపై నాని పెదవి విరిచాడు.
ఇక నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. ‘వైఫ్ ఆఫ్ రామ్’ మంచు లక్ష్మి బిగ్ బాస్ హౌస్‌లో మూవీ ప్రమోషన్స్‌ను నిర్వహించారు. ఈ మూవీ విశేషాలను తెలియజేస్తూ.. నానితో జరిపిన సంభాషణలు చాలా ఫన్నీ ఆటలు సందడిగా సాగాయి.
ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చిన తేజస్వి కౌశల్ ఫై సంచలన కామెంట్స్ చేసింది.
కౌశల్ నాకు ముందే తెలుసు. అతడు ఎలా ఉంటాడో నాకు మొత్తం తెలుసు. తను బాగా సెల్ఫిష్, తన స్వార్ధం మాత్రమే చూసుకుంటాడు. అతని విషయంలో నేను ఇప్పటికీ తప్పు చేశానని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అతనేంటో నాకు తెలుసు. నేను చేసింది కరెక్ట్ అనే అనిపిస్తుంది అన్నారు. చివరిగా ‘కౌశల్ నువ్వు బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తావేమో.. కాని నేను బిగ్‌బాస్ హౌస్‌లో అందరి మనసుల్ని గెలుచుకున్నాను ’ అని అన్నది.
గణేష్ పై బిగ్‌బాంబ్..
ఈ వారం బిగ్ బాంబ్‌ను కాస్త వెరైటీగా ప్లాన్ చేశారు. ముందు ఒక ఇంటి సభ్యుడిని ఎంచుకున్న తరువాత బిగ్‌బాంబ్ ఏంటి అనేది రివీల్ చేశారు. తేజస్వీ గణేష్‌ను ఎంచుకోగా.. తరువాతి వారం మొత్తం పాలసీసాతో నీటిని తాగడమే ఈవారం బిగ్‌బాంబ్ అంటూ నాని తెలిపారు.
మరిన్ని కథనాలు
Ninnu Kori Teaser Review: Looks promising and...
బిగ్ బాస్ హౌస్ లో...
Men’s Day Special: South Film Industry Maga Maha...
Actor Nani’s New Responsibility turns to buzz in...
Hero Nani Turns As Film Producer Latest Movie...
