కౌశల్ పై పూజ ఆగ్రహం
బిగ్ బాస్ సీజన్2 59వ ఎపిసోడ్ లో మహిళలు vs పురుషులు అంతిమ యుద్ధం కోసం పోటి పడ్డారు. ‘అంతిమ యుద్ధం’ టాస్క్ ప్రకారం రెండు టీంలకు చెరో 50 గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. మహిళల టీం నియంత్రణలో ఉండే స్థలాలు బెడ్ రూం, కిచెన్ పురుషులు టీం నియంత్రణలో లివింగ్ ఏరియా, బాత్ రూంలు ఉంటాయి. ఈ ఏరియా ల ను అవతలి టీం వాడుకోవాలంటే గోల్డ్ కాయిన్ని ఇచ్చి వాడుకోవాలి అని బిగ్ బాస్ ఆదేశించారు.
బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లను గెలిస్తే అదనంగా కొన్ని గోల్డ్ కిన్స్ పొందవచ్చు అని చెప్పారు. నూతన్ నాయుడుకి గాయం కారణంగా ఈ టాస్క్ నుండి మినహాయింపు ఇచ్చారు. ఇక ఈ టాస్క్ ఎవరు ఎక్కువ ప్రతిబ కనబరుస్తారో వారు కెప్టెన్సీ అయ్యే అవకాశాన్ని పొందవచ్చు.
గేమ్ స్టార్ట్ కాగానే.. ఎవరికి నిర్ధేశించిన స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫస్ట్ నుండి ఈ గేమ్‌లో పురుషులు టీం టాప్ లో నె కొనసాగింది. మూడు రౌండ్లలోనూ పురుషులు విజేతలుగా నిలిచారు. అయితే కౌశల్ మహిళల కాయిన్స్ బ్యాగ్‌ను దొంగిలించడంతో పూజా, కౌశల్ మధ్య వివాదం రేగింది.
గేమ్ ఆడే పద్దతి ఇది కాదంటూ.. దమ్ముంటే ఫెయిర్‌గా ఆడాలని సవాల్ చేసింది. కౌశల్ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అయ్యాడు. గేమ్ స్టార్ట్ అయిన తరువాత మీ కాయిన్స్ మీరు జాగ్రత్త చేసుకోలేదు. నేను తీశా అంటూ కౌశల్ కౌంటర్ విసిరాడు. కౌశల్ గేమ్ నిజాయితీగా ఆడటంలేదని తన వద్ద ఉన్న కాయిన్స్‌ని కోపం విసిరికొట్టింది పూజ. ఆ కాయిన్స్ సైతం తనీష్ స్వాధీనం చేసుకోవడంతో మహిళల టీంలో ఉన్న దీప్తి, గీతా, సునయనలు కాయిన్స్ కోసం నానా కష్టాలు పడ్డారు. దీంతో మహిళల స్వాధీనంలో ఉన్న కిచెన్ నుండి పురుషులకు వాటర్ కూడా ఇవ్వొద్దని, వాళ్లకు ఫుడ్ పెట్టొద్దని పూజ టీం వాళ్ళకి చెప్పింది. ఇక అన్ని టాస్క్ లు ఫిసికల్ గేమ్స్ కావడం తో అబ్బాయిలె గెలుస్తున్నారు. ఇక ఈ ‘అంతిమ యుద్ధం’ టాస్క్ లో ఎవరు బగా ప్రతిబ కనబరుస్తారో ఎవరు ఈ వారం కెప్టెన్ అవుతారో చూడాలి.
మరిన్ని కథనాలు

బిగ్ బాస్ హౌస్ లో ఈ...

అమిత్‌కు సీక్రెట్...

గీతా మాధురీ,...

మళ్ళి కౌశల్...

Nani's Majnu Theatrical Trailer
