హైదరాబాద్ లో అల్లు అర్జున్ "నా పేరు సూర్య " కీలక సన్నివేశాలు చిత్రీకరణ
నటీనటులు : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ యాక్షన్ కింగ్ అర్జున్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్
సినిమాటోగ్రఫి : రాజీవ్ రవి
సంగీతం : విశాల్ - శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాబు
బ్యానర్ : రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ : k.నాగబాబు
సహ నిర్మాత : బన్నీ వాసు
నిర్మాత : శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వ౦ : వక్క౦తం వంశీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్క౦తం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈరోజు నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో సినిమా ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. 14 వ తేదీ వరకు ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్ జరుగుతుంది. హోళి సందర్భ౦గ పోస్టర్ ఇంపాక్ట్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి... ప్రపంచవ్యాప్తంగా మే 4న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భ౦గ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వక్క౦తం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ... గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈరోజు నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ని అద్భుతమైన లోకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు ముఖ్య తారాగణం అంతా పాల్గొంటున్నారు. ఈ నెల 14 వ తేదీ వరకు ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్ జరుగుతుంది. హోళి సందర్భ౦గ పోస్టర్ ఇంపాక్ట్ ను రిలీజ్ చేశాం. మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.