‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ

నటీనటులు : జగపతిబాబు, నారా రోహిత్, దర్శన బానిక్, బ్రహ్మానందం, తులసి, జీవా, సుబ్బరాజు, నాగినీడు, చలపతిరావు తదితరులు
సంగీతం : సాయికార్తీక్
ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేశ్
ఛాయాగ్రహణం : విజయ్ సి.కుమార్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : పరుచూరి మురళి
సంస్థ : ఫ్రెం డ్స్ మూవీ క్రియేషన్స్
నిర్మాతలు : వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర
యంగ్ హీరో నారా రోహిత్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్ళుగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న జగపతిబాబు ఈ సినిమాలో క్రిమినల్ లాయర్ పాత్రలో నటించారు. మరి నారా రోహిత్ ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించాడా..? లేదా అన్నది చూద్దాం.
కథ : ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్ చేయాలని కలలు గనే సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్) . ఆ ప్రాజెక్టు పని మీద అంజలి(దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి సిద్ధార్థ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత తన ఇంట్లోనే అంజలి ని దారుణంగా హత్య చేస్తారు. తన భార్యను చంపిన కేసులో సిద్ధార్థ్ ను రిమాండ్ కు పంపిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేందర్(జగపతిబాబు) ముందుగా కేసును సిద్ధార్థ్‌కి ప్రతికూలంగా వాదించి అతన్ని దోషిగా చూస్తాడు. అయితే.. న్యాయం తన పక్కన ఉందని సిద్ధార్థ్ చెప్పిన విషయాలు విన్న వీరేందర్ కొన్ని ఆధారాలను సేకరించి.. తనకు అనుకూలంగే కేసు వాదించి నిర్ధోషిగా నిరూపిస్తాడు. అసలు అంజలిని చంపింది ఎవరు? సిద్ధార్థ, వీరేంద్రల మధ్య యుద్ధంలో ఎవరు గెలిచారు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ : క్రిమినల్ లాయర్‌గా జగపతిబాబు.. దర్శకుడి పాత్రలో నారా రోహిత్ ..పాత్రల పరంగా ఇద్దరు పాత్రల్లో ఒదిగిపోయారు. హీరోయిన్ గా నటించిన దర్శన బానిక్ ది కథా పరంగా కీలక పాత్రే అయిన నటనకు పెద్దగా ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత బ్రహ్మానందంకు కామెడీకి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. పోలీస్ ఆఫీసర్‌గా సుబ్బరాజు ఆకట్టుకున్నాడు.
ప్లస్ పాయింట్స్ : నారా రోహిత్, జగపతి బాబు నటన
మైనస్ పాయింట్స్ : కథనం
రేటింగ్ : 2.5/5