ఏ మంత్రం వేసావె మూవీ రివ్యూ

ఏ మంత్రం వేసావె మూవీ రివ్యూ

సినిమా పేరు : ఏ మంత్రం వేసావె

నటీనటులు : విజయ్‌ దేవరకొండ, శివానీ సింగ్‌, ఓమ్యా విరాక్‌, నీలాక్షి సింగ్‌, రాజ బాబు, ఆశిష్‌ రాజ్‌, ప్రభావతి, దీపక్‌ 

సంగీతం : అబ్దూస్‌ సమద్‌

కూర్పు : ధర్మేంద్ర కాకరాల

నిర్మాత : మల్కాపురం శివకుమార్‌

దర్శకత్వ౦ : శ్రీధర్‌ మర్రి

విడుదల తేదీ : 09-03-2018


యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌ రెడ్డి’తో ఓ సరికొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఈ సినిమా వచ్చిన ఉత్సాహంతో వరుస చిత్రాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ‘ఏ మంత్రం వేసావె’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాతో విజయ్‌ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నడో చూడాలి .


కథ : నిఖిల్ (విజయ్ దేవరకొండ) ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఎప్పుడూ వీడియో గేమ్స్, సోషల్ మీడియా అంటూ తల్లిదండ్రులను కూడ బాధపెడుతుంటాడు. కంప్యూటర్‌, వీడియో గేమ్‌ డిజైనర్‌గా పనిచేస్తుంటుంది రాగమాలిక (శివానీ సింగ్‌). హింసతో కూడిన ఆటలకు భిన్న౦గా మానవత్వ౦తో కూడిన ఆటలను డిజైన్‌ చేయాలనేది ఆమె ఆశయం. నిఖిల్ (విజయ్ దేవరకొండ) సోషల్ మీడియా ద్వారా రాగమాలిక (శివానీ సింగ్) అనే అమ్మాయిని ఇష్టపడి ఆమెకు దగ్గరవ్వాలనుకుంటాడు.


కానీ రాగమాలిక మాత్రం నిఖిల్ మెంటాలిటీని అంచనా వేసి తనని కలవాలంటే ఒక గేమ్ ఆడాలని అతనికి ఛాలెంజ్ విసురుతుంది. ఆ గేమ్ ఏంటి, నిఖిల్ దాన్ని ఎలా ఆడాడు, చివరికి ఆమెను చేరుకున్నాడా లేదా, అసలు రాగమాలిక, నిఖిల్ కు అలాంటి ఛాలెంజ్ ఎందుకు విసిరింది అనేదే ఈ సినిమా కథ.ఆ ఇద్దరూ ఏ పరిస్థితుల్లో ఎక్కడ కలుసుకున్నారు?వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ : విజయ్‌ దేవరకొండ లుక్‌ పరంగా, నటన పరంగా ఆకట్టుకున్నారు. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ పాత్ర పరిధి మేరకు చక్కటి ప్రభావం చూపిస్తారు. కథానాయిక శివానీ సింగ్‌ కూడా నటన పరంగా ఆకట్టుకుంది.పరిమిత వేగంతో తెరకెక్కిన చిత్రం కావడంతో పేరున్న నటీనటులు తెరపై కనిపించలేదు . సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది.


ప్లస్ పాయింట్స్ : కథ

                         విజయ్‌ దేవరకొండ నటన


మైనస్ పాయింట్స్ : వాణిజ్యాంశాలు లేకపోవడం

                             సాగదీతగా అనిపించే ద్వితీయార్థం

                             నిరాశపరిచే పతాక సన్నివేశాలు