‘విశ్వరూపం 2‌’ మూవీ రివ్యూ

‘విశ్వరూపం 2‌’ మూవీ రివ్యూ

న‌టీన‌టులు : కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ 

సంగీతం : మహమ్మద్‌ గిబ్రాన్‌

పాటలు : రామజోగయ్యశాస్త్రి

ఛాయాగ్ర‌హ‌ణం : శ్యాందత్, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్

కూర్పు : మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌

రచన, దర్శకత్వం : కమల్‌హాసన్‌

నిర్మాతలు : ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా స్వయంగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన సూపర్‌ హిట్ సినిమా విశ్వరూపం. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌గా విశ్వరూపం 2 ను తెరకెక్కించారు కమల్‌. వివిధ కారణాలతో ఆలస్యమైన ఈ సినిమాను ఫైనల్‌ గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా పేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా..?లేదా...? అనేది చూద్దాం. 

కథ : ఇండియ‌న్ ‘రా’ ఆదేశాల మేర‌కు ప‌నిచేసే సైనిక గూఢ‌చారి విసామ్ అహ్మ‌ద్ క‌శ్మీరీ (క‌మ‌ల్‌హాస‌న్‌). అల్‌ఖైదా ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి వాళ్ల వ్యూహాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు సైన్యానికి చేర‌వేస్తూ ప‌లు దాడుల్ని ఆపుతాడు. ఆ విష‌యం తెలిసిపోవ‌డంతో అల్‌ఖైదా ఉగ్ర‌వాది ఒమ‌ర్ ఖురేషి (రాహుల్ బోస్‌)... విసామ్‌ని అంతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. లండ‌న్‌లో బ్లాస్ట్ ప్లాన్ చేసిన ఓమ‌ర్‌.. త‌ర్వాత రెండో ప్ర‌పంచ యుద్ధంలో లండ‌న్ సముద్రంలో మునిగిన 1500 ట‌న్నుల బాంబుల‌ను యాక్టివేట్ చేసి దాని ద్వారా లండ‌న్ సిటీని నాశ‌నం చేయాల‌నుకునే ప్లాన్ కూడా వేస్తాడు. విష‌యం ప‌సిగ‌ట్టిన విసామ్ అహ్మ‌ద్ (క‌మ‌ల్ హాస‌న్‌) త‌న భార్య‌ న్లూక్లియ‌ర్ సైన్స్‌లో పి.హెచ్‌.డి చేసిన నిరుప‌మ‌(పూజా కుమార్‌).. అసిస్టెంట్ ఆశ్రిత‌(ఆండ్రియా) స‌హా వెళ్లి అక్క‌డ స‌ముద్ర గ‌ర్భంలోని యాక్టివేట్ చేయ‌బోయే బాంబుల‌ను డీ యాక్టివేట్ చేస్తాడు.నిరుప‌మ‌, ఆశ్రిత‌ల‌కు ఏమౌతుంది? ఇండియాలో ఓమర్‌కు స‌హాయం చేసేదెవ‌రు? ఓమ‌ర్ ఇండియాను నాశనం చేయ‌డానికి ఏ ప్లాన్ వేశాడు? ఓమ‌ర్ ప్లాన్‌ను విసాద్ ఎలా అడ్డుకున్నాడు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ : విశ్వరూపం సినిమాతో హాలీవుడ్ స్థాయి స్పై థ్రిల్లర్‌ను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసిన లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విశ్వరూపం 2తో అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. ముఖ్యంగా తొలి భాగం రిలీజ్ అయి చాలా కాలం కావటం.. సీక్వెల్‌లో చాలా సన్నివేశాలు తొలి భాగంతో లింక్‌ అయి ఉండటంతో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేరు. కమల్ హాసన్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా తొలి స‌గ‌భాగంలో ఈశ్వ‌ర ‌శాస్త్రితో క‌లిసి చేసిన స‌న్నివేశాలు, అక్క‌డ సంభాష‌ణ‌లు, ద్వితీయార్ధంలో త‌న త‌ల్లిగా న‌టించిన వహీదా రెహమాన్‌తో క‌లిసి నటించిన తీరు బాగుంటాయి. జిబ్రాన్ సంగీతం, శ్యాం ద‌త్‌, షాను జాన్ వ‌ర్గీస్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. క‌మ‌ల్‌హాస‌న్ తొలి భాగంతో పోలిస్తే ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా కాస్త నిరాశ‌ప‌రుస్తాడు.

ప్లస్ పాయింట్స్ : కమల్‌ హాసన్‌ నటన

                        సినిమాటోగ్ర‌పీ

మైనస్ పాయింట్స్ : క‌థ‌, క‌థ‌నం 

రేటింగ్ : 2.5/5