విజేత మూవీ రివ్యూ

విజేత మూవీ రివ్యూ

తారాగ‌ణం : క‌ల్యాణ్‌దేవ్‌, మాళ‌వికా నాయ‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నాజ‌ర్‌, ప్ర‌గ‌తి, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు

సంగీతం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న రామేశ్వ‌ర్‌

కూర్పు : కార్తీక శ్రీనివాస్‌

క‌ళ‌ : రామ‌కృష్ణ‌

చాయాగ్ర‌హ‌ణం : కె.కె.సెంథిల్ కుమార్‌

క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వ : రాకేశ్ శ‌శి

నిర్మాణ సంస్థ‌ : వారాహి చ‌ల‌న చిత్రం

నిర్మాత‌ : ర‌జ‌నీ కొర్ర‌పాటి, సాయికొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్స్‌

మెగా కుటుంబం నుండి తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మ‌రో హీరో క‌ల్యాణ్ దేవ్‌. ఈ సినిమా తండ్రి కొడుకుల‌ అనుబంధాన్ని తెలియ‌జేసేదిగా ఉంది. మరి చిరు అల్లుడు కల్యాణ్‌దేవ్‌ కథానాయకుడిగా నటించిన ‘విజేత’ ఎలా ఉంది? తండ్రీ-కొడుకుల అనుబంధాన్ని ఈ చిత్రంలో ఎలా చూపించారు? తొలి చిత్రంతో చిరు అల్లుడు ఏమేరకు ఆకట్టుకున్నారు?

కథ : శ‌్రీనివాస‌రావు(ముర‌ళీశ‌ర్మ) స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి. తన ఆశయాలను కోరికలను, ఇష్టాలను చంపుకొని కుటుంబ కోసం బతుకుతుంటాడు. శ్రీనివాస‌రావుకి కొడుకు, కూతురు ఉంటారు. కొడుకు రామ్‌(కల్యాణ్‌దేవ్‌) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంటాడు. అతనేమో అత్తెసర మార్కులతో పాసైన బ్యాచ్‌. ఉద్యోగం రాదు. శ్రీనివాసరావు స్నేహితుల పిల్లలు మంచి పొజిషన్‌లో ఉంటారు. కానీ, తన కొడుకు ఎప్పుడు ఎదుగుతాడా? అన్న బెంగ ఉంటాడు శ్రీనివాసరావు. రామ్ ఎదురింట్లో ఛైత్ర‌(మాళ‌వికా నాయ‌ర్‌) అద్దెకు వ‌స్తారు. ఛైత్ర‌ను రామ్ ఇంప్రెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేసిన రామ్‌కి..ప్రారంభంలో త‌ప్పులు జ‌రిగి చెడ్డ పేరు వ‌స్తుంది. అదే స‌మ‌యంలో శ్రీనివాస‌రావుకి గుండెపోటు వ‌స్తుంది. శ్రీనివాస‌రావు త‌ను లేక‌పోతే త‌న కుటుంబం ఏమైపోతుందోన‌ని బాధ‌ప‌డుతుంటాడు. అది చూసిన శ్రీనివాస‌రావు స్నేహితుడు(త‌నికెళ్ల‌భ‌ర‌ణి).. రామ్‌కి శ్రీనివాస‌రావు గురించి నిజం చెప్పి.. కుటుంబానికి తోడుగా నిల‌బ‌డ‌మ‌ని అంటాడు. రామ్ కూడా అప్పటి నుండి దారి మార్చుకుని తండ్రికి స‌హాయంగా ఉంటాడు. అప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? కొడుకుగా రామ్ శ్రీనివాస‌రావు క‌ల‌ను ఎలా తీర్చాడ‌నేదే క‌థ‌? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ : పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. వాటి గుర్తించి, తల్లిదండ్రులు కోల్పోయిన జీవితాన్ని ఇష్టాన్ని తిరిగి ఇవ్వడం పిల్లల బాధ్యత అని చెప్పిన సినిమా ఇది. మెగా అల్లుడు కల్యాణ్‌దేవ్‌ కథానాయకుడిగా పరిచయం అయిన సినిమా ఇది. కల్యాణ్‌దేవ్‌లోని బలాల్ని, మరింత బలంగా చూపించాలని కాకుండా, మాస్‌ హీరోగా ఎలివేట్‌ చేయాలని కాకుండా, కథను కథగా చెప్పాలనే ప్రయత్నమే ఎక్కువగా కనిపించింది. ఈ విషయంలో దర్శక-నిర్మాతలను అభినందించాలి. ఇక జ‌య‌ప్ర‌కాశ్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, మాళ‌వికా నాయర్‌, ప్ర‌గ‌తి ఇత‌రుల న‌ట‌న వారి వారి ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. మాళ‌వికా నాయ‌ర్ పేరుకు హీరోయిన్ కానీ... ఆ పాత్ర‌లో న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శ‌కుడు రాకేశ్ శ‌శి ఫ‌స్టాఫ్ అంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూనే సినిమాను న‌డిపించాడు. మొత్తంగా చూస్తే ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మిది.

ప్లస్ పాయింట్స్ : తండ్రీ కొడుకుల అనుబంధం 

                         సెకండాఫ్‌

మైనస్ పాయింట్స్ : స్లో నరేషన్‌

                             కామెడీ 

రేటింగ్ : 2.75/5