వెంకటేష్, వరుణ్ తేజ్ ల 'పెళ్ళికి ముందు...పెళ్లి తర్వాత'

వెంకటేష్, వరుణ్ తేజ్ ల 'పెళ్ళికి ముందు...పెళ్లి తర్వాత'

విక్టరీ వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్‌ మూవీ ఎఫ్‌ 2’.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్‌రాజు‘  నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఎఫ్‌ 2’ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఒక మగాడి జీవితం గురించి చెప్పాలంటే పెళ్లికి మందు... పెళ్లికి తర్వాత... పెళ్లాన్నిఎలా అదుపులో పెట్టాలో నాకు తెలుసువంటి డైలాగ్స్‌ వింటుంటే ఎఫ్‌2.. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఫన్‌ రైడర్‌ అని తెలుస్తోంది. కాగా తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని టీజర్‌ చెప్పేసింది. సంక్రాంతికి గట్టిగా నవ్వించేట్టున్నారుగా?’ అని ఓ పాత్ర అడగ్గా. అంతేగా.. అంతేగా..అంటూ నవ్వులు పంచారు వెంకీ, వరుణ్‌.