ఉత్తర మోషన్ పోస్టర్ విడుదల

ఉత్తర మోషన్ పోస్టర్ విడుదల
నటి నటులు : శ్రీరామ్, కారుణ్య కాథరిన్, అజయ్ ఘోష్ 
సంగీతం : సురేష్ బొబ్బిలి
కథ, దర్శకుడు, నిర్మాత : ఎస్ ఆర్ తిరుపతి
బ్యానర్ :  లివ్ ఇన్ సి క్రియేషన్స్  ( Live in C Creations )
లివ్ ఇన్ సి క్రియేషన్స్  ( Live in C Creations ) పతాకం పై ఎస్ ఆర్ తిరుపతి స్వీయ దర్శకత్వ లో శ్రీరామ్, కారుణ్య కాథరిన్  హీరో హీరోయిన్ గా అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నిర్మించబడుతున్న చిత్రం ఉత్తర . ఈ సినిమా కి సంభందించి మొదటి మోషన్ పోస్టర్ మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసారు. 70 శతం చిత్రీకరణ పూర్తియింది. త్వరలోనే ఆడియో విడుదల తేదీని తెలియజేస్తారు. ఈ సందర్భ గా

దర్శక నిర్మాతలు ఎస్ ఆర్ తిరుపతి మాట్లాడుతూ "ఉత్తర ఒక మంచి రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం . అన్ని కమర్షియల్ హంగులతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన చిత్రం ఇది. శ్రీరామ్, కారుణ్య లు చాలా బాగా నటించారు. అజయ్ ఘోష్ గారి  పాత్ర ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది.నీది నాది ఒకే కథ చిత్రానికి సంగీతం అందించిన  సురేష్ బొబ్బిలి మా చిత్రానికి  సంగీతం అందించారు. వారి పాటలు మరియు మ్యూజిక్  ఈ చిత్రానికి ప్రాణం పోసింది. 70 శతం షూటింగ్ పూర్తియింది. సినిమా చాల బాగా వస్తుంది.  త్వరలో ఆడియో ని విడుదల చేస్తాము  " అని తెలిపారు.