యు ట‌ర్న్ ట్రైల‌ర్ విడుద‌ల‌

యు ట‌ర్న్ ట్రైల‌ర్ విడుద‌ల‌
న‌టీన‌టులుస‌మంత‌, ఆది పినిశెట్టి, రాహుల్ ర‌వీంద్ర‌న్, భూమిక చావ్లా, న‌రైన్
క‌థ‌, ద‌ర్శ‌కుడు : ప‌వ‌న్ కుమార్
నిర్మాత‌లు : శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు 
బ్యాన‌ర్స్ : శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్
సంగీతం : పూర్ణ చంద్ర తేజ‌స్వి
సినిమాటోగ్ర‌ఫ‌ర్ : నికేత్ బొమ్మి
ఆర్ట్ డైరెక్ట‌ర్ : ఏఎస్ ప్ర‌కాశ్
ఎడిట‌ర్ : సురేష్ ఆర్ముగం
స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న యు ట‌ర్న్ సినిమా ట్రైల‌ర్ ను సినీమాక్స్ లో చిత్ర‌యూనిట్ స‌మ‌క్షంలో విడుద‌ల చేసారు. 

ఈ సంద‌ర్భగా స‌మంత మాట్లాడుతూ.. ఓ వైపు మాజీ ప్ర‌ధాన‌మంత్రి వాజ్ పెయి మ‌ర‌ణం.. మ‌రోవైపు కేర‌ళ వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్న ఈ స‌మ‌యంలో కూడా త‌మ సినిమా ప్రెస్ మీట్ కు వ‌చ్చినందుకు మీడియా అంద‌రికి ధన్య‌వాదాలు. కానీ మాది చిన్న సినిమా.. అంద‌రూ అర్థం చేసుకుంటార‌నే ఆశిస్తున్నాను. యు ట‌ర్న్ అనేది ఓ హానెస్ట్ సినిమా.. దీనికి ప‌ని చేసిన‌వాళ్లంతా వంద‌శాతం త‌మ కృషి పెట్టారు. ఇది మంచి సినిమా అని.. మేం మంచి ప్ర‌యత్న చేసామ‌నే అనుకుంటున్నాం. కెరీర్ లో తొలిసారి కొత్త నిర్మాత‌ల‌తో పని చేస్తున్నాను.. చాలా కంఫ‌ర్ట్ గా ఉంది. మా ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ కూడా అద్భుతంగా ప‌ని చేసాడు. క‌న్న‌డ‌లో పెద్ద ద‌ర్శ‌కుడు అయినా కూడా ఇక్క‌డ బాగా స‌పోర్ట్ చేసాడు. ఫ్యూచ‌ర్ లో మ‌రో సినిమా కూడా చేయాల‌ని కోరుకుంటున్నాను. రాహుల్ ర‌వీంద్ర‌న్, ఆది పినిశెట్టి ఈ చిత్రానికి మ‌రింత స్టార్ ప‌వ‌ర్ అందించారు. సినిమాటోగ్ర‌ఫ‌ర్ నికేత్ ఇండ‌స్ట్రీలో చాలా దూరం వెళ్తాడ‌ని ఆశిస్తున్నాను అని చెప్పారు. 

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాకు చాలా మంచి అనుభ‌వాన్ని ఇచ్చింది. దానికి చాలా కార‌ణాలున్నాయి. ఇలాంటి టీంతో మ‌ళ్లీ మ‌ళ్ళీ ప‌ని చేయాల‌ని ఉంది. తొలి రోజు షూటింగ్ పూర్తి కాగానే గుడ్డిగా ద‌ర్శ‌కున్ని న‌మ్మేసాను. ప‌వ‌న్ కుమార్ ఏం చెబితే అది చేసాను. స‌మంత విష‌యానికి వ‌స్తే.. రంగ‌స్థ‌లంలో కలిసి ప‌ని చేసినా కూడా ఆమె న‌ట‌న గురించి కానీ.. ఆమె గురించి కానీ పూర్తిగా తెలియ‌లేదు. కానీ ఇప్పుడు తెలిసింది.. స‌మంత మంచి మ‌నిషి కూడా. ఈమె లాంటి బెస్ట్ యాక్ట్రెస్ ను ఇప్ప‌టి వ‌ర‌కు క‌ల‌వ‌లేదు అన్నారు.