చంద్రబాబుకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు

చంద్రబాబుకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టాలీవుడ్‌ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తామని తెలుగు సినీ పరిశ్రమ తెలిపింది. ఈ మేరకు సినీ ప్రముఖులు కె. రాఘవేంద్ర రావు, కేఎల్‌ నారాయణ, అశ్వనీదత్‌, కేఎస్‌ రామారావు, కె. వెంకటేశ్వరరావు, జెమిని కిరణ్‌,తదితరులు సీఎంను కలిశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో నిరసనలో పాల్గొన్నారు. ఏప్రిల్‌ 6 వరకు నల్లబ్యాడ్జీలు ధరించనున్నట్లు పేర్కొన్నారు