అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినీ పెద్దలు

అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినీ పెద్దలు

గత కొద్ది రోజులు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మా అధ్యక్షులు శివాజీ రాజా.. నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లు అరవింద్‌, కేయస్‌ రామారావు అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోకు చేరుకున్నారు. పవన్‌ కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సమావేశానికి నిర్మాతల మండలితో పాటు సినీ రంగంలోని 24 శాఖలకు సంబంధించిన వారు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ముందుగా ఈ సమావేశాన్ని ఛాంబర్‌లోనే నిర్వహించాలని భావించినా.. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌, సినీ పెద్దలు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.