టాలీవుడ్ దర్శకుల పార్టీ...

టాలీవుడ్ దర్శకుల పార్టీ...

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ అంతా ఒకే ఫ్రేమ్‌లో సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంట్లో సోమవారం రాత్రి పార్టీని నిర్వహించగా, అగ్ర దర్శకులంతా హాజరయ్యారు. రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌లతోపాటు అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ వంగవీటి, వంశీ పైడిపల్లి ఇలా అంతా ఒక్కచోట చేరారు. వీరంతా కలిసి ఓ ఫోటో దిగగా, ‘అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను’ అంటూ వంశీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. అలాగే మ‌రో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా ఈ మీట్ గురించి ట్వీట్ చేశాడు. `ఫ‌న్‌`టాస్టిక్‌. మ‌ర్చిపోలేని సాయంత్రం. అద్భుత‌మైన పార్టీకి ఆతిథ్య‌మిచ్చిన వంశీ అన్న‌కు ధ‌న్య‌వాదాలు` అంటూ అనీల్ రావిపూడి ట్వీట్ చేశాడు.