తొలి ప్రేమ మూవీ రివ్యూ

తొలి ప్రేమ మూవీ రివ్యూ

చిత్రం : తొలిప్రేమ 
నటీనటులు : వరుణ్‌తేజ్‌,రాశీఖన్నా,ప్రియదర్శి,సుహాసిని 
సంగీతం : తమన్‌ 
ఛాయాగ్రహణం : జార్జ్‌ సి.విలియమ్స్‌ 
ఎడిటింగ్‌ : నవీన్‌ నూలి 
డిస్ట్రిబ్యూషన్‌ : శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌ 
కథ, స్క్రీన్‌ప్లే
దర్శకత్వ౦ : వెంకీ అట్లూరి 

నిర్మాత : బి.వి.ఎన్‌.ఎస్‌. ప్రసాద్‌ 
బ్యానర్‌ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర 
విడుదల తేదీ : 10-02-2018 

కథఆదిత్య(వరుణ్‌ తేజ్‌) ఒక రైలులో వర్ష(రాశీఖన్నా)ను చూస్తాడు. తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అనుకోకుండా వీరిద్దరూ ఒకే కళాశాలలో చేరతారు. తనను ప్రేమించాలంటూ ఆదిత్య.. వర్ష వెంట పడుతూ ఉంటాడు. క్రమక్రమంగా ఆదిత్య ప్రేమలో పడుతుంది వర్ష. ఆదిత్యకి కోపం ఎక్కువ. దేనికైనా ముందు గొడవపడి తర్వాత ఆలోచిస్తాడు. కానీ, వర్ష అలా కాదు. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య ఈ తేడానే గొడవలకు కారణమవుతుంది. దీంతో ఆదిత్య-వర్ష విడిపోతారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత లండన్‌లో ఇద్దరూ కలుసుకుంటారు. అక్కడ వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది?ఒకరి మీద ఒకరికి కోపం తగ్గిందా? అన్నదే కథ.

విశ్లేషణద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తొలి సినిమా ఇది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ. ప్రేమ క‌థ అంటే ప్రేమికులు క‌లుసుకోవ‌డం.. విడిపోవ‌డం.. మ‌ళ్లీ క‌లుసుకోవ‌డం అనే పాయింట్ కామ‌న్‌గానే ఉంటుంది. ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ల్లో ఎమోష‌న్స్‌, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్రేక్ష‌కులు ఆ ఫీల్‌కి లోన‌వుతారు. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో ర‌న్ అవుతుంది. అయితే సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. మాత్రం స‌న్నివేశాల‌ను లాగిన‌ట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ ఎఫెక్టివ్‌గా ఉండాల‌నిపించింది. సెకండాఫ్ నెరేష‌న్ ఫ్లాట్‌గా అనిపించింది. అయితే సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. వెంకీ అట్లూరి క‌థకు త‌మ‌న్ త‌న సంగీతం, నేప‌థ్య సంగీతంతో బ‌లాన్ని చేకూర్చాడు. జార్జ్ సి.విలియ‌మ్స్ ప్ర‌తి స‌న్నివేశాన్ని అందంగా తెర‌పై చూపించాడు.

ప్లస్ పాయింట్స్ : వరుణ్ తేజ్ ,రాశి ఖాన్న నటన 

                        డైలాగ్స్

                        సినిమాటోగ్రఫి 

మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ బోరింగ్ సీన్స్