ఎన్టీఆర్ బయోపిక్ లో మరో బ్యూటీ 'ఈషా రెబ్బా '

ఎన్టీఆర్ బయోపిక్ లో మరో బ్యూటీ  'ఈషా రెబ్బా '

స్వర్గీయ నందమూరి తారక రామారావు  జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం లో ఎన్టీఆర్  పాత్రలో  బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే .ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు శ్రీదేవిగా రకుల్ ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మీనన్‌, కృష్ణకుమారిగా మాళవిక నాయర్‌, ప్రభగా శ్రియ,జయసుధగా  పాయల్‌ రాజ్‌పుత్‌, జయప్రధగా హన్సికలు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో బ్యూటీ వచ్చి చేరింది. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కూడా యన్‌టిఆర్‌లో నటించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య, ఈషా కాంబినేషన్‌లో పలు సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే ఈషా ఎవరి పాత్రలో కనిపించనుందన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం యన్‌టిఆర్‌ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.