'టాక్సీవాలా' మూవీ రివ్యూ

టైటిల్ : టాక్సీవాలా
తారాగణం: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్, కళ్యాణి, ఉత్తేజ్
సంగీతం: జాక్స్ బెజోయ్
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్
నిర్మాత : ఎస్ కె ఎన్
జోనర్: కామిక్ థ్రిల్లర్
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఇప్పుడు టాక్సీవాలా అంటూ మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకోకుండా పైరసీ షాక్ కి గురి కావడంతో చిత్ర యూనిట్ టెన్షన్ లో ఉండిపోయింది. మరి ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందిందా? విజయ్ మరో సక్సెస్ ను తన జాబితా లో వేసుకున్నాడా? నిర్మాతల కష్టం ఫలించిందా ? ఈ విషయాలు తెలుసుకోవాలంటే అస్సలు కథ ఏంటో చుద్దాం...
కథ:
మూడు ఏళ్లలో పాస్
అవ్వాల్సిన డిగ్రీ ని ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి పాస్ అవుతాడు శివ (విజయ్
దేవరకొండ). తన సొంత కాళ్ళ మీద నిలబడాలని, అన్న వదిన(కళ్యాణి) ల మీద ఆధార పడటం
ఇష్టం లేక హైదరాబాద్ కి వస్తాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేక క్యాబ్ డ్రైవర్
అవ్వాలని అనుకుంటాడు. డబ్బు కోసం అన్న ని అడిగితే, వదిన తన నగలు
అమ్మి డబ్బు శివ కి ఇస్తుంది. క్యాబ్ కొన్న మొదటి రోజే అను (ప్రియాంక ) ను
చూస్తాడు శివ. అక్కడి నుండి తనను ప్రేమిస్తూ ఉంటాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో
తన చుట్టూ జెరిగే పరిణామాలను చుస్తే కార్ లో దెయ్యం ఉందని శివ కి అనుమానం
వస్తుంది. నిజంగానే టాక్సీ లో దెయ్యం వుందా? ఆ టైం లో శివ ఏం చేసాడు? అస్సలు ఈ కథ తో
శిశిర (మాళవిక నాయర్) కు,
అను కు సంబంధం ఏంటీ? ఇంతకి ఆ దెయ్యం శివ టాక్సీ లో ఎందుకు
వుంది? అనేదే మిగతా
స్టోరీ.
విశ్లేషణ:
టాక్సీవాలా సినిమా
తో మరోసారి తన నటనని నిరూపించాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగ క్లైమాక్స్ లో తన
ఎమోషన్స్ తో ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గ తొలిపరిచయం అయిన
ప్రియాంక తన అందం తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. మాళవిక నాయర్, ఉత్తేజ్, కళ్యాణి, యమునా, రవి వర్మ, ప్రకాష్, హీరో ఫ్రెండ్ గ
మధుసూదన్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారని చెప్పొచ్చు. ఈ సినిమా లో కామెడీ బాగుంది.
అందరిని బాగా నవ్వించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా బాగానే
వున్నాయి, ముఖ్యంగ
"మాటే వినదుగ వినదుగ" అనే పాటకు ప్రేక్షకాదరణ లభించింది. విజువల్
ఎఫెక్ట్స్ కొంచెం నీరసనిచ్చాయి. టోటల్ గా ఈ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చిందని
చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
విజయ్ నటన
కామెడీ
కథ
మైనస్ పాయింట్స్:
గ్రాఫిక్స్
పాటలు
సెకండ్ హాఫ్ లో
కొన్ని సీన్స్