రెగ్యులర్ షూటింగ్‌లో సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం

రెగ్యులర్ షూటింగ్‌లో  సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం

సినిమాటోగ్రఫీ : ఆర్.కె. ప్రతాప్

సంగీతం : శేఖర్‌చంద్ర

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్

కళా దర్శకత్వ : లక్ష్మీసింధూజ గ్రంధి

ప్రాజెక్ట్ డిజైనర్ : కృష్ణ చిత్తనూర్ 

స్టెలింగ్ : సుష్మ త్రిపురాన

ప్రొడక్షన్ కంట్రోలర్ :సలాన బాలగోపాలరావు

మూలకథ : వెంకట శ్రీనివాస్ బొగ్గరం

రచనా సహకారం : నాగమురళీధర్ నామాల

నిర్మాతలు : ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ : సంతోష్ జాగర్లపూడి

ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం ఉగాది పర్వదినాన ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వ వహిస్తున్నారు.  ఈషా కథానాయికగా  నటిస్తున్నది. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భగా నిర్మాతలు  చిత్ర విశేషాలను తెలియజేస్తూ సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. సుమంత్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. ఈ నెల 4వ తేదీ నుంచి రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాం. ఈ నెల 12 వరకు ఆర్‌ఎఫ్‌సీలో జరిగే ఈ షెడ్యూల్‌లో సుమంత్, ఈషారెబ్బా, జోష్వ్రి ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. తప్పకుండా సుమంత్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.