సుమంత్ చిత్రం ఇదం జగత్

సుమంత్ చిత్రం ఇదం జగత్

నటినటులు : శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ

కెమెరా : బాల్‌రెడ్డి

ఎడిటింగ్ : గ్యారీ బీహెచ్

సంగీతం : శ్రీచరణ్ పాకాల

కో-ప్రొడ్యూసర్ : మురళీకృష్ణ దబ్బుగుడి

కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వ : అనీల్ శ్రీ కంఠం

నిర్మాతలు : జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్న శ్రీధర్

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న ఓ వైవిధ్యమైన చిత్రానికి ఇదం జగత్ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని నిర్ణయించారు. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్న శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ  సుమంత్ ఈ చిత్రంలో  కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విభిన్నమైన ఆ పాత్ర ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. టైటిల్‌కు చక్కని స్పదన వస్తోంది. హీరో పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం అని తెలిపారు.