మరో వారసుడు వచ్చేసాడు...

మరో వారసుడు వచ్చేసాడు...

అంబరీష్-సుమలత కుమారుడు అయిన అభిషేక్ అంబరీష్.. తెరంగేట్రం చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. అమర్ అనే చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు అభిషేక్. నగషేకర్ అనే దర్శకుడు రూపొందిస్తున్న చిత్రం ద్వారా కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు అభిషేక్. సందేశ్ నాగరాజ్ నిర్మాణం వహించగా తాన్యా హోప్ హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సినిమాల్లో ఎంట్రీ కోసం.. ఈ కుర్రాడు బాగా శ్రమించాడు. కిక్ బాక్సింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్ ను.. ప్రత్యేకంగా థాయ్ ల్యాండ్ వెళ్లి నేర్చుకున్నాడు.