మహేష్‌తో సుకుమార్ మూవీ

మహేష్‌తో  సుకుమార్ మూవీ

రంగస్థలం సినిమాతో అదిరిపోయే హిట్‌ను సొంతం చేసుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రం విజయంతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.తాజాగా రంగస్థలం సక్సెస్ సందర్భగా పాల్గొన్న ఓ ఇంటర్వూలో సుకుమార్ తన తర్వాతి చిత్రం గురించి ప్రకటన చేశాడు. సుక్కు తన తర్వాతి చిత్రాన్ని మహేష్‌బాబుతో తీయనున్నట్టు తెలిపాడు.

ఇది వరకు మహేష్, సుకుమార్ కాంబినేషన్లో ‘వన్ నేనొక్కడినే’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ, టెక్నికల్‌గా తెలుగు సినిమా స్థాయిని పెంచిందని చెప్పాలి.ఈ సినిమా తర్వాత మహేష్‌తో ఖచ్చితంగా మరో సినిమా చేస్తానని సుకుమార్ పలు మార్లు తెలిపాడు. ఎట్టకేలకు ఈ విషయాన్ని సుకుమార్ అధికారికంగా ప్రకటించడంతో మహేష్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

మహేష్ ప్రస్తుతం ‘భరత్ అనే నేను’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయనున్నాడు. వీటి తర్వాత సుకుమార్ దర్శకత్వలో మహేష్ నటించనున్నాడు.