బావగా మ‌హేశ్‌కి ద‌గ్గ‌రయ్యాను - సుధీర్ బాబు

బావగా మ‌హేశ్‌కి ద‌గ్గ‌రయ్యాను - సుధీర్ బాబు

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా సెన్సిటివ్ దర్శకుడు మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం ‘స‌మ్మోహ‌నం’. చిత్ర విజయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా చేస్తున్నాడు కదా! వీడేంటో? అని సామాన్యులు దూరంగా ఉండిపోయారు. అలాంటి వాళ్లకు నన్ను దగ్గర చేసిన చిత్రం ‘సమ్మోహనం’. ఇప్పటివరకూ నన్ను ‘ప్రేమకథా చిత్రమ్‌’ సుధీర్‌బాబు అని పిలిచేవారు. ఇకపై ‘సమ్మోహనం’ సుధీర్‌బాబు అంటారు. మహేశ్‌ బావగా నాకు దగ్గరే కానీ.. యాక్టర్‌గా కాస్త గ్యాప్‌ ఉండేదనిపించేది. ఈ సినిమా ఓ యాక్టర్‌గా నన్ను తనకు దగ్గర చేసింది. షూటింగ్‌లో నరేశ్‌గారిని నిజమైన నాన్నగానే భావించా. ఇంద్రగంటిగారు భాషను ప్రేమించేంతలా భార్యను కూడా ప్రేమించరు’’ అన్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి కృష్ణ‌గారు, చిరంజీవిగారు, మ‌హేశ్‌గారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ, పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’’ అన్నారు.