‘సిల్లీ ఫెలోస్‌‌’ మూవీ రివ్యూ

తారాగ‌ణం : అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్ర శుక్ల, నందిని, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి

ద‌ర్శ‌కుడు : భీమినేని శ్రీ‌నివాస్

సినిమాటోగ్ర‌ఫీ : అనీష్ త‌రుణ్ కుమార్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : ఎం కిర‌ణ్ కుమార్

సంగీత ద‌ర్శ‌కుడు : శ్రీ‌వ‌సంత్

ఎడిట‌ర్ : గౌతంరాజు

నిర్మాత‌లు : కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి

సంస్థ‌లు : బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్ మ‌రియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ

యంగ్ హీరో అల్లరి నరేష్‌, హీరోగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక తిరిగి కమెడియన్‌గా టర్న్‌ అయిన సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ సిల్లీ ఫెలోస్‌. ఎప్ప‌టిలాగానే భీమ‌నేని త‌న మార్కు త‌మిళ సినిమాను రీమేక్ చేసి సిల్లీ ఫెలోస్‌గా తీసుకొచ్చాడు. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కులను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలుస‌కోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం. 

కథ : ఎమ్మెల్యే జాకెట్ జాన‌కిరామ్ (జ‌య‌ప్ర‌కాశ్‌ రెడ్డి) కి న‌మ్మిన బంటు వీరబాబు (న‌రేష్‌). జానకిరామ్‌ మంత్రి అయితే.. తాను ఎమ్మెల్యే అయిపోవాల‌ని ఎదురుచూస్తుంటాడు. జాన‌కిరామ్‌కి మ‌రింత పేరు రావాల‌ని ఏర్పాటు చేసిన సామూహిక వివాహాల కార్య‌క్ర‌మం చూస్తుంటాడు సూరిబాబు. దానికోసం త‌న ఫ్రెండు సూరి బాబు (సునీల్‌)కి పుష్ప‌తో బ‌ల‌వంతంగా పెళ్లి చేయించేస్తాడు. అప్పటికే సూరిబాబుకు కృష్ణవేణి (పూర్ణ)తో పెళ్లి కుదరటంతో పుష్పను వదిలించుకునేందుకు ఎమ్మెల్యే జాకెట్‌ను ఆశ్రయించాలనుకుంటాడు. అదే సమయంలో తను ప్రేమించిన వాసంతి (చిత్ర శుక్ల) కూడా ఎమ్మెల్యే జాకెట్ జాన‌కిరామ్ దగ్గర కనిపిస్తుంది. మినిస్టర్ చనిపోతూ 500 కోట్లకు సంబంధించిన రహాస్యాన్ని జాకెట్‌కు చెప్పటంతో భూతం(పోసాని కృష్ణమురళి) ఆ డబ్బు కోసం జాకెట్ వెంటపడతాడు. మ‌ధ్య‌లో ఎమ్మెల్యే గొడ‌వ ఏంటి? 500కోట్ల సంగ‌తి ఏంటి? వ‌ంటివ‌న్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడక తప్పదు.

విశ్లేషణ : కామెడీ స్టార్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న నరేష్ మరోసారి తన ఇమేజ్‌కు తగ్గ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. జేపీ, పోసాని న‌వ్వించారు. రీమేక్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న దర్శకుడు భీమినేని శ్రీనివాస్‌ రావు మరోసారి రీమేక్‌ కథతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ప్లస్ పాయింట్స్ : సునీల్, నరేష్, నటన 

                         కామెడీ 

మైనస్ పాయింట్స్ : సెకండ్‌ హాఫ్

రేటింగ్ : 2/5





మరిన్ని కథనాలు

మాస్‌ హీరో విశాల్‌...
దీపావళి కానుకగా...
దేశముదుర్స్...
మొదటి షెడ్యూల్ ...
‘ఎన్టీఆర్‌’...