పెళ్లి పీటలు ఎక్కనున్న శ్రియ....?

పెళ్లి పీటలు ఎక్కనున్న శ్రియ....?

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ మార్చిలో పెళ్లికూతురు కానుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్‌ చేస్తోంది.

దక్షిణాదిలో మంచి నటిగా పేరుతెచ్చుకున్న శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

35 ఏళ్ల వయసులోనూ ఈ జనరేషన్‌ హీరోయిన్‌ లకు గ్లామర్‌లో పోటీ ఇస్తున్న ఈ భామ సీనియర్‌ హీరోల సరసన నటిస్తూ కెరీర్‌ కొనసాగిస్తోంది. ఇటీవల పరిచయం అయిన ఓ రష్యన్‌ యువకుడితో శ్రియ సన్నిహితంగా ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి.

ఆ యువకుడినే వచ్చే నెలలో వివాహమాడేందుకు రెడీ అవుతుందట. తన విషయంపై అబ్బాయి తరపు వారితో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యా వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది.

రాజస్థాన్‌లో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అయితే, ఈ వార్తలపై శ్రియ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.