‘శంభో శంకర’ మూవీ రివ్యూ

‘శంభో శంకర’ మూవీ రివ్యూ

నటీనటులు : షకలక శంకర్‌, అజయ్‌ ఘోష్‌, కారుణ్య తదితరులు

సంగీతం : సాయి కార్తిక్‌

సినిమాటోగ్రఫీ : రాజశేఖర్‌ ఎస్‌

కూర్పు : చోటా కే ప్రసాద్‌

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వ : శ్రీధర్‌ ఎన్‌

నిర్మాత : సురేశ్‌ కొండేటి

క‌మెడియ‌న్స్ హీరోలుగా మారి విజ‌యాలు అందుకుంటున్నారు. ఒక‌వైపు క‌మెడియ‌న్‌గా రాణిస్తూ.. మ‌రో వైపు హీరోలుగా సినిమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జబర్దస్త్‌ షోతో ఫేమస్‌ అయిన షకలక శంకర్‌ హీరోగా మారి ‘శంభో శంకర’తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ‌రి ఈ చిత్రం శంక‌ర్‌కు హీరోగా ఎలాంటి ట‌ర్న్ ఇచ్చింది? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

కథ : కడప జిల్లా అంకాలమ్మ పల్లె గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరికి రాబందు లాంటి ప్రెసిడెంట్‌ అజయ్‌ ఘోష్‌. ఆ ప్రెసిడెంట్‌కు తోడు గా ఓ అవినీతి పోలీసాఫీసర్‌. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ ఊరి ప్రజలకు అండగా ఉంటాడు మన హీరో ‌శంకర్ (షకలక శంకర్)‌. ఇక ఈ కథనంలో ఊర్లో శంకర్‌కి ఒక ప్రేయసి పార్వతి (కారుణ్య చౌదరి). ప్రెసిడెంట్‌ కొడుకు మూలంగా చెల్లెల్ని పోగొట్టుకున్న శంకర్‌ ఆ ప్రెసిడెంట్‌ కొడుకును చంపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. ఎస్‌.పి(నాగినీడు)కి  శంక‌ర్ గురించి తెలుసు కాబ‌ట్టి అత‌ను శంక‌ర్‌ని త‌న పూచీ క‌త్తుపై విడుద‌ల చేస్తాడు. శంక‌ర్ వెళ్లి ప్రెసిడెంట్‌ని ఢీ కొట్టాల‌నుకుంటాడు. అప్పుడు శంక‌ర్ ఏం చేస్తాడు? ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? క‌థ చివ‌ర‌కి ఏమ‌వుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : ఒక కమెడీయన్‌ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు.. దర్శకులు కామెడీ ఎంటర్‌టైనర్‌నో లేదా.. కథా బలం ఉండి ఆకట్టుకునే కథనంతో ఉన్న చిత్రాలనో ఎంచుకుంటారు. కానీ దర్శకుడు శ్రీధర్ మాత్రం శంకర్‌తో మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ట్రై చేశాడు. ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ క‌థంతా ఓ ప‌ల్లెటూరిని బేస్ చేసుకుని రాసుకున్నాడు. ప్ర‌తి సీన్ ఎందుకు వ‌స్తుందో.. ఎందుకు ఎండ్ అవుతుందో అనే చందాన తెర‌పై మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. హీరో, అత‌ని చెల్లెలు మ‌ధ్య సెంటిమెంట్ స‌న్నివేశాలు, హీరో చెల్లెలు కోసం ప్రెసిడెంట్ కొడుకుని చంపేయ‌డం ..పోలీసుల కేసు పెట్ట‌కుండా అత‌న్ని వ‌దిలేయడం ఇవ‌న్నీ క‌ల్ప‌న‌కే చాలా దూరంగా ఉన్న‌ట్లు అనిపిస్తాయి. ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా చేసిన ప్రయత్న వృథా అయ్యింది.

ప్లస్ పాయింట్స్ : శంకర్‌ నటన 

                          సంగీతం

మైనస్ పాయింట్స్ : వినోదం లేకపోవడం

                             సాంకేతిక వర్గం