శరభ మూవీ రివ్యూ

శరభ మూవీ రివ్యూ

తారాగ‌ణం : ఆకాశ్‌ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్ దీప్

ద‌ర్శ‌కుడు : నరసింహ రావు

సినిమాటోగ్ర‌ఫీ : రమణ సాల్వ

సంగీత ద‌ర్శ‌కుడు : కోటి

నిర్మాత‌లు : అశ్వని కుమార్ సహదే

సంస్థ‌లు : ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్మెంట్

జయప్రద రీఎంట్రీ ఇస్తూ, భారీ సాంకేతిక వర్గ బలంతో రూపొందుతూ, విసువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేసి విడుదలైన సినిమా శరభ. అగ్ర తార‌లు లేని చిత్రాలు కూడా ఉన్న‌త‌మైన సాంకేతిక హంగుల‌తో రూపొందుతున్న స‌మ‌య‌మిది. సినిమా బాగుందంటే వ‌సూళ్లు కూడా అదే త‌ర‌హాలో ఉంటాయ‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల న‌మ్మ‌కం. అందుకే ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా క‌థ కోరుకున్న‌ట్టుగానే తెర‌కెక్కిస్తుంటారు. మరి ఆ అంచనాలను శరభ అందుకుందా..? ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్‌ కుమార్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? జయప్రధ రీ ఎంట్రీలో సత్తా చాటారా..?

కథ : ప‌చ్చ‌టి పైర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది సిరిగిరిపురం. అలాంటి ఊరిపై దుష్ట‌శ‌క్తుల క‌న్నుప‌డుతుంది. క్షుద్ర‌ సామ్రాజ్య స్థాప‌న చేయాల‌ని చండ్రాక్ష (పునీత్ ఇస్సార్‌) అనే మాంత్రికుడు మ‌హిళ‌ల్ని బ‌లి ఇస్తుంటాడు. ఇంకో బ‌లి జ‌రిగితే తాను అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌ని ఆ ప్రయత్నంలో ఉంటాడు. శరభ (ఆకాష్‌ కుమార్‌) సిరిగిరిపురంలో సరదాగా కాలం వెల్లదీసే అల్లరి కుర్రాడు. కొడుకే ప్రాణంగా బతికే పార్వతమ్మ (జయప్రధ) ఎన్ని తప్పులు చేసినా శరభను ఒక్క మాట కూడా అనదు. దివ్య (మిస్తీ చక్రవర్తి) సెంట్రల్‌ మినిస్టర్(షియాజీ షిండే) కూతురు. తన జాతక దోశాలకు సంబంధించిన శాంతి కోసం మినిస్టర్‌ తన కూతురిని సిరిగిరిపురంలోని గురువు (పొన్‌వన్నన్‌) గారి దగ్గర విడిపెట్టి వెళతాడు. 17 మంది అమ్మాయిలను బలి ఇచ్చిన రాక్షసుడు 18వ బలి కోసం దివ్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే సమయంలో శరభ గతానికి సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. రాక్షసుడితో శరభ చేసే పోరాటంలో దైవ శక్తి ఎలా సహాయపడింది..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ : ‘అమ్మోరు’, ‘అరుంధ‌తి’ చిత్రాల త‌ర‌హాలో ఉన్న‌త‌మైన సాంకేతిక హంగుల‌తో చిత్రాన్ని తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. క‌థ‌లో మ‌లుపులు ఆక‌ట్టుకుంటాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్ చిత్రానికి ప్రాణం పోశాయి. ప‌తాక స‌న్నివేశాల్లో న‌ర‌సింహావ‌తారంలో దుష్ట‌శిక్ష‌ణ ఆక‌ట్టుకుంటుంది. నాజ‌ర్‌, ‘జ‌బ‌ర్ద‌స్త్’ రాకేష్ వినోదాన్ని పంచే ప్ర‌య‌త్నం చేశారు. పునీత్ ఇస్సార్‌, చ‌ర‌ణ్‌దీప్, ఆచారి పాత్ర‌లో క‌నిపించిన పొన్‌వ‌న్న‌న్ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. చండ్రాక్ష పాత్ర తీర్చిదిద్దిన విధానంత అంత‌గా కుద‌ర‌లేదు. విల‌నిజం మ‌రింత బాగా పండుంటే ఈ సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. ముఖ్యంగా హీరో హీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌కొట్టిస్తాయి. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మేకప్‌, గ్రాఫిక్స్‌ కీలకం. కానీ ఆ రెండు విషయాల్లో శరభ నిరాశపరుస్తుంది.

ప్లస్ పాయింట్స్ : 

జయప్రద నటన 

సెకండ్ హాఫ్ లో సీన్స్

విజువల్ ఎఫెక్ట్స్

మైనస్ పాయింట్స్ : 

ఫస్ట్ హాఫ్ లో కామెడీ లేకపోవడం

సంగీతం