సమ్మోహనం మూవీ రివ్యూ

సమ్మోహనం మూవీ రివ్యూ

నటినటులు : సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్రా లోకేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ,అభయ్ ,హర్షిణి త‌దిత‌రులు

సంగీతం : వివేక్ సాగ‌ర్‌

కూర్పు : మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

ఛాయాగ్ర‌హ‌ణం : పి.జి.విందా

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వ : ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌

నిర్మాణ సంస్థ‌ : శ‌్రీదేవి మూవీస్‌

నిర్మాత‌ : శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వ౦లో వ‌చ్చిన మ‌రో ప్రేమ‌క‌థా చిత్రం `సమ్మోహ‌నం`.

ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు, స్టార్ హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అనే విష‌యాన్ని తెర‌కెక్కించారు ఇంద్ర‌గంటి.  మ‌రి స‌మ్మోహ‌నం ప్రేక్ష‌కులను మెప్పించిందా... లేదా? అని చూడాలి.

కథ : విజ‌య్‌కుమార్ (సుధీర్‌బాబు) సినిమా వాళ్లంటే ఇష్టం ఉండదు. వారు సినిమాలో చూపించేదంతా న‌టనే.. వారికి ఎమోష‌న్స్ ఉండ‌వు .. అనేటువంటి భావ‌న‌లుంటాయి. అయితే విజ‌య్ తండ్రి (సీనియ‌ర్ న‌రేశ్‌)కి మాత్రం సినిమాలంటే ఎంతో అభిమానం ఉంటుంది. త‌ను ఓ సంద‌ర్భలో సినిమా యూనిట్‌కు వాళ్ల ఇంటికి ఫ్రీగా అద్దెకిస్తాడు. ఆ సినిమాలో హీరోయిన్ స‌మీరా రాథోడ్‌(అదితిరావు హైద‌రి). ఈమెకు తెలుగు రాదు. విజ‌య్‌ని త‌న సినిమాకు తెలుగు డైలాగ్స్ నేర్పించ‌మ‌ని కోరుతుంది స‌మీరా. అలా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరుగుతుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. స‌మీర కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌దు. విజ‌య్ చెప్పిన ప్రేమ‌ను రిజెక్ట్ చేస్తుంది. దాంతో విజయ్ డిస్ట్ర‌బ్ అవుతాడు. అసలు సమీర ఇష్టమున్నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది. అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ : వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చాలా బాగా కుదిరింది. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా పాజిటివ్ వేలో చెప్పి మెప్పించ‌గ‌లిగారు ఇంద్ర‌గంటి. శ్రీదేవి మూవీస్ సంస్థ అందించిన నిర్మాణ విలువ‌లు తెర‌పై స్ప‌ష్టంగా క‌నిపించాయి.  డైలాగులు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్ : నటీనటుల నటన

                         కామెడీ

                         పాటలు

మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్