డ‌బ్బింగ్ చెబుతున్న అదితిరావు హైద‌రీ

డ‌బ్బింగ్ చెబుతున్న అదితిరావు హైద‌రీ

న‌టీన‌టులు : సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, డా .వీకే న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందుకాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ  

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్ :  పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు

కో డైర‌క్ట‌ర్‌ : కోట సురేశ్ కుమార్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : య‌స్ . ర‌వీంద‌ర్‌

ఎడిట‌ర్‌ : మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌

డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ : పి.జి.విందా  

సంగీతం : వివేక్ సాగ‌ర్‌

పాట‌లు : సిరివెన్నెల‌ సీతారామ‌శాస్త్రి, రామ‌జోగయ్య‌శాస్త్రి

నిర్మాత‌ : శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌  

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వ : మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వలో  శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న‌ చిత్రం `స‌మ్మోహ‌నం`.  శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కుతోన్న `స‌మ్మోహ‌నం` జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ  సినిమా కోసం అదితీరావు హైద‌రి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకొంటున్నారు.

నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``ఇంద్ర‌గంటి ఎప్పుడూ తెలుగుద‌నానికి ప్రాముఖ్య‌త‌నిస్తారు.దాదాపుగా  తెలుగమ్మాయిల‌నే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారు. ఆయ‌న ప్ర‌తి సినిమాలోనూ ఇదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్నారు. `స‌మ్మోహ‌నం` నాయిక అదితిరావు హైద‌రి తెలుగు మూలాలున్న అమ్మాయి. కానీ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది . చాలా బాగా డ‌బ్బింగ్‌ చెబుతోంది . ఆ అమ్మాయి గొంతు కూడా చాలా బావుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన తొలి పాట‌కు మంచి స్పద‌న వ‌చ్చింది. జూన్ 15న సినిమాను విడుద‌ల చేస్తాం`` అని అన్నారు. 

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``కొత్త ఎత్తుగడ , కొత్త పోకడ ఉన్న నవతరం కథ `స‌మ్మోహ‌నం`.  రొమాన్స్ ,హాస్య స‌మ్మిళిత‌మై ఉంటాయి.  పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ , వివేక్ సాగ‌ర్ సంగీతం , రవీందర్ కళా దర్శకత్వ మెప్పిస్తాయి.  మంచి క‌థ‌, క‌థ‌నానికి  చ‌క్క‌టి నిర్మాణ విలువ‌లు తోడ‌య్యాయి. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా మొత్తం అంద‌మైన  ఫీల్ క్యారీ చేశాం`` అని చెప్పారు.